చెట్లు నరికిన వారిపై చర్యలు తీసుకోవాలి

Sep 16 2021 @ 23:30PM
సత్యసాయి ఆలయం వద్ద చెట్లను నరికివేసిన దృశ్యం

మెదక్‌ మున్సిపాలిటీ, సెప్టెంబరు 16: అకారణంగా చెట్లను నరికివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ మేడి మధుసూదన్‌రావు అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. తొమ్మిదో వార్డులోని సత్యసాయి ఆలయం వద్ద ఏపుగా పెరిగిన చెట్లను అనవసరంగా కొంతమంది నరికివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై అటవీశాఖ, మున్సిపల్‌  అధికారులు బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ విషయంపై కలెక్టర్‌కు సైతం ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. 

Follow Us on:

ఆంధ్రప్రదేశ్ మరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.