తిరుపతి వేదికగా వ్యవసాయ వర్సిటీ స్వర్ణోత్సవ స్నాతకోత్సవం

ABN , First Publish Date - 2021-07-27T06:34:47+05:30 IST

ఆచార్య ఎన్జీరంగ వ్యవసాయ విశ్వ విద్యాలయం స్వర్ణోత్సవ స్నాతకోత్సవాన్ని వచ్చేనెల 10న తిరుపతి ఎస్వీ వ్యవసాయ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు వీసీ డాక్టర్‌ ఎ.విష్ణువర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు.

తిరుపతి వేదికగా వ్యవసాయ వర్సిటీ స్వర్ణోత్సవ స్నాతకోత్సవం
ఆన్‌లైన్‌లో మాట్లాడుతున్న వీసీ విష్ణువర్ధన్‌రెడ్డి , తిరుపతిలో వ్యవసాయ కళాశాలలో మాట్లాడుతున్న రిజిస్ట్రార్‌ గిరిధర్‌కృష్ణ

హాజరుకానున్న సీఎం, గవర్నర్‌ 

ఏర్పాట్లు పరిశీలించిన వర్శిటీ అధికారులు 


తిరుపతి(విద్య), జూలై 26: ఆచార్య ఎన్జీరంగ వ్యవసాయ విశ్వ విద్యాలయం స్వర్ణోత్సవ స్నాతకోత్సవాన్ని వచ్చేనెల 10న తిరుపతి ఎస్వీ వ్యవసాయ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు వీసీ డాక్టర్‌ ఎ.విష్ణువర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఏర్పాట్లను పరిశీలించేందుకు వర్సిటీ రిజిస్ర్టార్‌ డాక్టర్‌ టి.గిరిధర్‌కృష్ణ, ప్రతాప్‌కుమార్‌ రెడ్డి, సీఈ సుధాకర్‌, ఎస్టేట్‌ అధికారి పీవీ నరసింహరావు సోమవారం కళాశాలను సందర్శించి ఏర్పాట ్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆ వర్సిటీ వీసీ మాట్లా డుతూ 50వ స్నాతకోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు పటిష్ఠమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ఈ స్నాతకోత్సవానికి సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి, చాన్సలర్‌ హోదాలో గవర్నర్‌ విశ్వభూషన్‌ హరిచందన్‌ హాజరుకానున్నారని తెలిపారు. కాగా స్నాతకోత్సవం నిర్వహణకు వర్సిటీ ఏర్పాటు చేసిన కమిటీలతో రిజిస్ర్టార్‌, డీన్‌ సమావేశమై ప్రాథమిక స్థాయిలో చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఏడీ డాక్టర్‌ రవీంద్రనాధ్‌రెడ్డి, ఏడీఆర్‌ డాక్టర్‌ ప్రశాంతి, వివిధ కమిటీ కన్వీనర్లు, అధ్యాపకులు, అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-27T06:34:47+05:30 IST