వర్షంతో రోడ్లన్నీ జలమయం

ABN , First Publish Date - 2022-06-29T04:49:19+05:30 IST

సంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. దాంతో జిల్లా కేంద్రమైన సంగారెడ్డితో పాటు పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి.

వర్షంతో రోడ్లన్నీ జలమయం
సంగారెడ్డిలోని కలెక్టరేట్‌ సమీపంలో జలమయమైన ప్రధాన రహదారి

 అత్యధికంగా సంగారెడ్డిలో 60.5 మి.మీ.ల వాన


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి/జహీరాబాద్‌, జూన్‌ 28: సంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. దాంతో జిల్లా కేంద్రమైన సంగారెడ్డితో పాటు పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగి పొర్లాయి. వర్షపు నీరు రోడ్ల మీదే మోకాలిలోతు నిలవడంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడ్డారు. సంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా సంగారెడ్డిలో 60.5 మి.మీ.ల వర్షం కురిసింది. అలాగే కందిలో 47.0 మి.మీ., పుల్కల్‌లో 36.5 మి.మీ., కంగ్టిలో 34.5 మి.మీ., అందోలు మండలం అల్మాయిపేటలో 34.3 మి.మీ., మునిపల్లి మండలం కంకోల్‌లో 28.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. కాగా తక్కువగా గుమ్మడిదల మండలం నల్లవల్లిలో 4.8 మి.మీ. వర్షం కురిసింది. జహీరాబాద్‌ మండలం సత్వార్‌లో 6.0 మి.మీ., కల్హేర్‌, బీహెచ్‌ఈఎల్‌లలో 6.5 మి.మీ., నారాయణఖేడ్‌లో 6.8 మి.మీ., జహీరాబాద్‌ మండలం మల్చెల్మలో 7.0 మి.మీ. వర్షం కురిసింది. జహీరాబాద్‌ మండలంలో 19.0 మిల్లీ మీటర్లు, కోహీర్‌లో 15.3 మి.మీ., న్యాల్‌కల్‌లో 26.5మి.మీ., మొగుడంపల్లిలో 7.8మి.మీ., ఝరాసంగంలో 12.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జహీరాబాద్‌ నియోజకవర్గంలోని కోహీర్‌, న్యాల్‌కల్‌, ఝరాసంగం, మొగుడంపల్లి మండలాలతో పాటు జహీరాబాద్‌ పట్టణంలో మంగళవారం సాయంత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. వర్షాకాలం ప్రారంభమై 20 రోజులవుతున్నా సరైన వర్షాలు కురువకపోవడంతో ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి పొలాల్లో విత్తనాలు నాటుతున్న రైతులు ఆందోళనకు గురయ్యారు. మంగళవారం కురిసిన వర్షంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేశారు. 


చిల్‌పచెడ్‌లో 9.8 మి.మీ.ల వర్షపాతం


తూప్రాన్‌/చిల్‌పచెడ్‌, జూన్‌ 28: మెదక్‌ జిల్లా చిల్‌పచెడ్‌ మండలంలో మంగళవారం మధ్యాహ్నం ఏకధాటిగా 3 గంటల వరకు కురసింది. మండలంలో 9.8 మి.మీ.ల వర్షపాతం నమోదైనట్లుగా ఏఎ్‌సవో వెంకటేశ్‌ తెలిపారు. తూప్రాన్‌ పట్టణంలో కురిసిన వర్షానికి హైస్కూల్‌ ఆవరణ నీటితో నిండిపోయింది. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడ్డారు.


 

Updated Date - 2022-06-29T04:49:19+05:30 IST