ఏకగ్రీవానికి ప్రతిపక్షాలు ముందుకు రావాలి

ABN , First Publish Date - 2021-03-01T06:28:48+05:30 IST

యానాం అభివృద్ధి కోసం పుదుచ్చేరికి కాబోయే ముఖ్యమంత్రిని యానాం నుంచి ఎమ్మెల్యేగా ఏకగ్రీవంగా పంపేందుకు ప్రతి పక్షాలు ముందుకు రావాలని మాజీ ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు ప్రతిపక్షాలకు సూచించారు.

ఏకగ్రీవానికి ప్రతిపక్షాలు ముందుకు రావాలి

మాజీ ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు
యానాం, ఫిబ్రవరి 28: యానాం అభివృద్ధి కోసం పుదుచ్చేరికి కాబోయే ముఖ్యమంత్రిని యానాం నుంచి ఎమ్మెల్యేగా ఏకగ్రీవంగా పంపేందుకు ప్రతి పక్షాలు ముందుకు రావాలని మాజీ ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు ప్రతిపక్షాలకు సూచించారు. ఏకగ్రీవం చేసేందుకు ప్రతిపక్షాలు ముందుకు వస్తే తాను సిద్ధంగా ఉన్నానన్నారు. 31ఏళ్ల రాజకీయ అనుభవం, 25ఏళ్లు ఓటమి ఎరుగని నాయకుడిగా ఉన్న తాను యానాం అభివృద్ధి కోసం రంగసామిని యానాం అభ్యర్థిగా ప్రకటించానన్నారు. ఉపాధి, సంక్షేమం, అభివృద్ధి కోసం తాను తీసుకున్న నిర్ణయానికి ప్రతిపక్షాలు ఏకగ్రీవానికి ముందుకొస్తే తాను సిద్ధంగా ఉన్నానని, అవసరమైతే తనకు ఇస్తానన్న రాజ్యసభ స్థానాన్ని కూడా త్యాగం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు. దీనికి సంబంధించి ప్రతిపక్షాలు ఏ ఒప్పందం తీసుకొచ్చినా సిద్ధంగా ఉన్నానన్నారు. యానాం అబివృద్ధే ధ్యేయమని మల్లాడి స్పష్టం చేశారు.

Updated Date - 2021-03-01T06:28:48+05:30 IST