సాగునీటికి ‘రియల్‌’ అడ్డంకులు

Jun 22 2021 @ 00:31AM
దబ్బందుల కాల్వపై క్రాస్‌బండ్లు వేసి వంతెన నిర్మిస్తున్న దృశ్యం

అమలాపురం-గూడాల కెనాల్‌కు సాగునీరు బంద్‌

తీరుబడిగా వంతెన నిర్మాణపనులు చేపట్టిన రియల్టర్లు

4 వేల ఆయకట్టుదారుల ఆందోళన


(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

సాగునీటి కాల్వలకు నీటిని విడుదల చేయడంలో అడుగడు గునా అవరోధాలు ఏర్పడుతూనే ఉన్నాయి. జిల్లాలోని ప్రధాన పంట కాల్వలకు ఈనెల 15న నీటిని విడుదల చేసినప్పటికీ ఆ నీరు నేటికీ కొన్ని కాల్వలకు అందని పరిస్థితి. తాజాగా అమలా పురం - చల్లపల్లి ప్రధాన పంటకాల్వను ఆనుకుని ఉన్న దబ్బం దల కాల్వపై రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఇప్పటికిప్పుడు వంతెన నిర్మాణాన్ని చేపట్టడానికి వీలుగా కాల్వలో నీటి ప్రవాహానికి క్రాస్‌ బండ్లు వేశారు. ఫలితంగా రెండు మండలాల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 4 వేల ఎకరాలకుపైగా ఆయకట్టు భూము లకు నీరు స్తంభించిపోయింది. ఇప్పటికే కాల్వలకు నీటిని విడు దల చేసినప్పటికీ అమలాపురం-ముక్కామల మధ్య రోడ్డు నిర్మా ణంలో భాగంగా రిటైనింగ్‌ వాల్‌ నిర్మించడం వల్ల ఐదు రోజులు ఆలస్యంగా అమలాపురం, బెండా కెనాల్‌కు నీటిని విడుదల చేశా రు. ఇప్పుడు ఆ నీరు సబ్‌ కెనాల్స్‌ ద్వారా ఆయకట్టుకు వెళ్లేం దుకు అధికార వైసీపీ నాయకులు అడ్డుకట్ట వేశారని రైతుల ఆరోపణ. విత్తనాలవారి కాల్వగట్టు సమీపంలో ఒక కాలనీ ప్రజల కోసం తాజాగా వంతెన నిర్మాణ పనులను ఇప్పుడే చేపట్టారు. ఆ పనుల్లో భాగంగా నీటి ప్రవాహం సాగకుండా క్రాస్‌బండ్‌ వేసి అడ్డంకి సృష్టించారు. ఫలితంగా అమలాపురం రూరల్‌ మండల పరిధిలోని చిందాడగరువు, రోళ్లపాలెం, వన్నెచింతలపూడి, ఇమ్మి డివరప్పాడుతోపాటు అల్లవరం మండలంలోని తాడికోన, కోడూ రుపాడు, గూడాల పరిధిలోని సుమారు 4 వేల ఎకరాలకుపైగా ఆయకట్టుకు సాగునీటితోపాటు తాగునీరు కూడా స్తంభించి పోయింది.


ఇప్పటివరకు చోద్యం చూసిన నిర్మాణదారులు ఇప్పు డు అధికార వైసీపీ కీలక నేత ఆదేశాలతో వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టడం వల్ల మరికొన్ని రోజులు అమలాపురం-గూడాల వెళ్లే కాల్వకు నీరందని పరిస్థితి ఏర్పడుతుంది. తక్షణమే ఈ కెనాల్‌కు సాగునీటిని విడుదలచేసి సాగు జాప్యం జరగకుండా చూడాల్సిన బాధ్యత ఇరిగేషన్‌ అధికారులపైనే ఉందని అమలా పురం పార్లమెంటరీ రైతువిభాగం టీడీపీ జిల్లాశాఖ అధ్యక్షుడు మట్టా మహలక్ష్మిప్రభాకర్‌ డిమాండు చేశారు. ఈ విషయంపై ఇరిగేషన్‌శాఖ ఏఈ అజయ్‌ను వివరణ కోరగా విత్తనాలవారి కాల్వగట్టు సమీపంలో వంతెన నిర్మాణ పనులు ప్రారంభమ య్యాయని, రెండు మూడు రోజుల్లోనే కాల్వకు వేసిన అడ్డంకు లను తొలగించి సాగునీటిని కింది ప్రాంతాలకు విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.