వచ్చేనెల 30 నుంచి అమ్మవారి బ్రహ్మోత్సవాలు

ABN , First Publish Date - 2021-10-27T06:39:32+05:30 IST

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నవంబరు 30 నుంచి డిసెంబరు 8వ తేదీ వరకు జరగనున్నాయి.

వచ్చేనెల 30 నుంచి అమ్మవారి బ్రహ్మోత్సవాలు

తిరుచానూరు, అక్టోబరు 26: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నవంబరు 30 నుంచి డిసెంబరు 8వ తేదీ వరకు జరగనున్నాయి. కొవిడ్‌ నేపథ్యంలో ఈ ఉత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తారు. వాహన మండపంలోనే ఆయా వాహనాలపై ఉత్సవమూర్తిని కొలువుదీర్చి పూజా కైంకర్యాలు నిర్వహించనున్నారు. అమ్మవారి బ్రహ్మోత్సవాలకు ముందురోజైన 29వ తేది ఉదయం లక్షకుంకుమార్చన, సాయంత్రం అంకురార్పణ నిర్వహిస్తారు. 23న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపడతారు. అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నవంబరు 30న ధ్వజారోహణం, డిసెంబరు 1న పెద్దశేష, హంస వాహన సేవలు, 2న ముత్యపుపందిరి, సింహ, 3న కల్పవృక్ష, హనుమంత, 4న పల్లకిఉత్సవం, వసంతోత్సవం, గజవాహనం, 5న ఉదయం సర్వభూపాల, సాయంత్రం స్వర్ణరథం బదులుగా సర్వభూపాల, రాత్రి గరుడ, 6న సూర్యప్రభ, చంద్రప్రభ, 7న సర్వభూపాల (రథోత్సవం బదులుగా), అశ్వవాహన సేవలు, 8న పంచమీతీర్థం (వాహన మండపంలో), ధ్వజావరోహణంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. 

Updated Date - 2021-10-27T06:39:32+05:30 IST