‘అమ్మ’కు షాక్‌!

ABN , First Publish Date - 2022-06-26T07:00:58+05:30 IST

కాకినాడ జిల్లా పరిధిలో ఒకటి నుంచి పది వరకు 3,10,003మంది విద్యార్థులుండగా ఇందు లో 1,87,671మంది తల్లులే అర్హులుగా ప్రభుత్వం నిర్ధారించింది. 1,22,342మంది తల్లులను పథకం నుంచి ఏరిపారేసింది. అంటే 39.50శాతం మందిని తప్పించింది.

‘అమ్మ’కు షాక్‌!

  • జిల్లాలో అమ్మఒడి లబ్ధిదారుల్లో భారీగా కోత
  • సగానికి సగం తల్లులను పథకం లబ్ధి నుంచి తప్పించేసిన ప్రభుత్వం
  • 3,10,003మంది విద్యార్థులకుగాను 1,87,671 మందికే పథకం వర్తింపు
  • 1,22,342మంది తల్లులను పథకం నుంచి ఏరిపారేసిన జగన్‌ సర్కార్‌
  • మొత్తం విద్యార్థుల్లో ఏకంగా 39.5శాతం మందిని అనర్హులుగా కోసేసిన వైనం
  • కరెంటు బిల్లులు, ఆధార్‌ లింక్‌, కొత్తరేషన్‌కార్డు, 75శాతం హాజరు సాకుతో కోతలు
  • అసలు అనర్హత వేటు ఎందుకు వేశారో కూడా చెప్పని సచివాలయ సిబ్బంది
  • కానీ ఆర్థిక భారం నుంచి తప్పించుకునేందుకే సాకు ఎత్తుగడలు

జిల్లాలో అమ్మఒడి పథకం లబ్ధిదారులకు జగన్‌ ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. గతేడాది ఏకంగా ఖాతాలో డబ్బులు జమ చేయకుండా తప్పించుకున్న సర్కార్‌ ఈసారి అర్హులను అడ్డంగా కోసేసింది. చిన్నచిన్న కారణాలను చూపించి లబ్ధి నుంచి మినహాయించింది. దీంతో లక్షలాదిమంది తల్లులు ప్రభుత్వంనుంచి అందే అమ్మఒడి సాయానికి దూరమయ్యారు. అన్ని దరఖాస్తులు సక్రమంగానే అందించినా విద్యార్థి హాజరు 75శాతానికి మించినా సరే అర్హుల జాబితాలో పేరు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏ సాకుతో పేరు తీసేశారో కూడా సచివాలయాల్లో చెప్పకపోవడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

(కాకినాడ, ఆంధ్రజ్యోతి)

కాకినాడ జిల్లా పరిధిలో ఒకటి నుంచి పది వరకు 3,10,003మంది విద్యార్థులుండగా ఇందు లో 1,87,671మంది తల్లులే అర్హులుగా ప్రభుత్వం నిర్ధారించింది. 1,22,342మంది తల్లులను పథకం నుంచి ఏరిపారేసింది. అంటే 39.50శాతం మంది ని తప్పించింది. తద్వారా రూ.183కోట్ల భారాన్ని జగన్‌ సర్కార్‌ తగ్గించుకుంది. ఉమ్మడి జిల్లాలో కాకినాడలోని 21మండలాల్లో 2,12,047మందికి ఖా తాలో డబ్బులు పడగా, అప్పటితో పోల్చినా ఇప్పు డు లబ్ధిదారుల సంఖ్య కుచించుకుపోయింది.

అంతా గుట్టే...

తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పిల్లలను బడికి పంపే ప్రతి తల్లి బ్యాంకుఖాతాలో రూ.15వేలు జమ చేస్తానని హామీ ఇచ్చిన జగన్‌ తీరా సీఎం అయ్యాక పథకం అమల్లో అ డుగడుగునా మాట తప్పుతూ వస్తున్నారు. లక్షలమంది తల్లు లకు బ్యాంకులో కోట్లకు కోట్లు నగదు జమచేయలేక లబ్ధిదారు లను క్రమక్రమంగా ఏరిపారేస్తున్నారు. గతేడాది ఏకంగా పథ కమే అమలు చేయలేదు. అంతకుముందు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 2019-2020లో 6,85,748 మంది విద్యార్థులు పథకానికి అర్హులుగా తేలితే 4,57,222 లక్షలమంది తల్లుల ఖాతాల్లో రూ.685కోట్లు జమ చేశారు. ఆ తర్వాత 2020-2021 లో 7,47,596మంది అర్హులకు 4,83,622 మందికి రూ.725కోట్లు ఖాతాలో డబ్బులు వేశారు. గతేడాది ఏకంగా కొవిడ్‌ కారణం తో బోధన జరగలేదనే సాకుతో పథకాన్ని అటకెక్కించి ఈ ఏడాది జమ చేస్తున్నారు. మొన్న ఏప్రిల్‌లో జిల్లాల విభజన జరగడంతో కాకినాడ జిల్లాలోని 21 మండలాల్లో ఒకటినుంచి పది వరకు చదువుతున్న 3,10,013మంది విద్యార్థులకు ఈ సారి అమ్మఒడి అందాల్సి ఉంది. వీరిలో 1,87,671మంది తల్లు లనే పథకానికి ప్రభుత్వం అర్హులుగా నిర్ధారించింది. ఈ మేర కు అత్యంత గోప్యంగా జాబితాను జిల్లా విద్యాశాఖకు శనివా రం సాయంత్రం పంపింది. వాస్తవానికి ఈనెల 27న అమ్మ ఒడి పథకం డబ్బులు తల్లుల ఖాతాలో జమ చేస్తామని చెప్పి న ప్రభుత్వం కాకినాడ జిల్లానుంచి అసలు ఎంతమంది అర్హు లు, ఎంతమంది అనర్హులు అనే వివరాలు ఏవీ పంపలేదు. దీనికితోడు డీఈవోలు అం దరినీ శుక్రవారం అమరావ తికి పిలిపించుకుని పథ కంలో ఏరివేతల గురించి చర్చించింది. ఆ తర్వాత శనివారం సాయంత్రానికి జాబితా గుట్టు చప్పుడు కా కుండా చేతిలో పెట్టడంపై అధికార వర్గాలు సైతం ని వ్వెరపోయాయి. దీని ప్రకా రం 1,22,342మంది తల్లుల ను పథకంనుంచి జగన్‌ ప్రభుత్వం ఏరిపారేసింది. వాస్తవానికి ఉమ్మడి తూ ర్పుగోదావరి జిల్లాలో అమ్మ ఒడి పథకం కింద బ్యాంకు ఖాతాలో డబ్బులు పడ్డ స మయంలో ఇప్పటి కాకినా డ జిల్లాలోని 21 మండలా ల్లో 2,12,047 మంది విద్యా ర్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమయ్యాయి. అప్పట్లో దాదాపు 3.50లక్షల మందికిపైగానే అర్హత సాధించినా కేవలం 2,12,047 మందికే డబ్బులు పడ్డాయి. అప్పటితో పోల్చినా ఈసారి లబ్ధిదారుల సంఖ్యలో కోత భారీగానే ఉంది.

ఎన్ని సాకులో...

అమ్మఒడి పథకం కింద డబ్బుల జమను రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనుంచీ భారం గా పరిగణించింది. ఏదొక సాకుతో అర్హులను కుదిం చడమే పనిగా పెట్టుకుంది. ఇప్పటివరకు రెండుసార్లు మాత్రమే ఖాతాలో డబ్బులు జమ చేయగా లబ్ధిదా రులు లక్షల్లో ఉన్నారు. రానురాను రాష్ట్ర ఆర్థిక పరి స్థితి పూర్తిగా సంక్షోభంలో చిక్కుకుపోవడంతో కోట్లలో నగదు జమ చేయడం ప్రభుత్వానికి తలకుమించిన భారంగా మారింది. దీంతో ఈసారి రకరకాల నిబం ధనలు ప్రవేశపెట్టింది. గతేడాది పథకాన్ని పూర్తిగా ఎత్తేయగా అప్పటి డబ్బులను ఈ ఏడాది జమచేస్తామని చెప్పింది. అనేక వాయిదాల తర్వాత సోమవా రం జమ చేస్తోంది. కానీ ఈ లోపు ఎంత వీలైతే అంతమేరకు అర్హుల జాబితా కుదించడం కోసం విద్యుత్‌ వినియోగం 300 యూనిట్లు దాటి న వారిని పథకం నుంచి పీకేసింది. హాజరు 75శాతం మించాలని షర తు విధించింది. కొత్త రేషన్‌కార్డు మంజూరైన వారిని, స్థలాలు కొను క్కున్న వారి పేర్లను తప్పించింది. ఇదికాకుండా అన్నీ సక్రమంగానే ఉన్నా డబ్బులు ఇచ్చే ఉద్దేశం లేక కొన్ని పేర్లు తీసేసింది. ఇలా జిల్లా వ్యాప్తంగా లక్షలాదిమందిని తప్పిం చేసింది. వీరిని ఎందుకు అనర్హులు గా గుర్తించారో సంబంధిత సచి వాలయాలకు ప్రభుత్వం సమాచా రం చేరవేయాలి. కానీ కారణం గోప్యంగా ఉంచింది. దీంతో జాబితా లో పేరు లేని వారు కారణం ఏంటని అడిగితే తమకు తెలి యదని జిల్లాలో సచివాలయ సిబ్బంది చెబుతున్నారు. అర్హుల జాబితానే అందుబాటులో ఉంచడంతో పేరు లేని వాళ్లు ప్రభు త్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-06-26T07:00:58+05:30 IST