కాలం చెల్లిన సంపూర్ణ పోషణపై విచారణ

ABN , First Publish Date - 2022-10-02T05:08:27+05:30 IST

అంగన్‌వాడీ కేంద్రంలో కాలం చెల్లిన సంపూర్ణ పోషణ ప్యాకెట్ల పంపిణీపై శనివారం తాడిపత్రి సీడీపీఓ షాజిదాబేగం విచారణ చేపట్టారు.

కాలం చెల్లిన సంపూర్ణ పోషణపై విచారణ

 యాడికి, అక్టోబరు 1: అంగన్‌వాడీ కేంద్రంలో కాలం చెల్లిన సంపూర్ణ పోషణ ప్యాకెట్ల పంపిణీపై శనివారం తాడిపత్రి సీడీపీఓ షాజిదాబేగం విచారణ చేపట్టారు. అంగన్‌ వాడీ కేంద్రం-9లోని సంపూర్ణ పోషణ ప్యాకెట్లను పరిశీలించారు. గర్భి ణులు, బాలింతలను విచారణ చేశారు. వారితో రాతపూర్వకంగా ఫిర్యాదు తీసుకున్నారు. మరో రెండు అంగ న్‌వాడీ కేంద్రాలను ఆమె తనిఖీ చేసి సంపూర్ణ పోషణ ప్యాకెట్లను పరిశీలించారు. అక్కడ కూడా కాలం చెల్లిన ఎండు ఖర్జూరాలు, రాగిపిండి ఉండడం గమనార్హం. అనంతరం ఆమె మాట్లాడుతూ మండల వ్యాప్తంగా ఎండు ఖర్జూరాలు, రాగిపిం డి కాలపరిమితి ముగిసిన వాటిని పంపిణీ చేశారని, దీనిపై కాంట్రాక్టర్‌తో మాట్లాడామని వాటిని రీప్లేస్‌ చేస్తామని తెలి పారు. కాల పరిమితి చూసు కోకుండా సంపూర్ణ పోషణ ప్యాకెట్లు పంపిణీ చేసి, విధుల్లో నిర్లక్ష్యం వహించిన అంగన్‌వాడీ వర్కర్‌కు మెమో జారీచేస్తామని ఆమె తెలిపారు. సీడీపీఓ వెంట యాడికి, తాడిపత్రి సూపర్‌వైజర్లు హుస్సేనమ్మ, కల్పనలు ఉన్నారు.


Updated Date - 2022-10-02T05:08:27+05:30 IST