అనంతపురం: జిల్లాలోని మూడో పట్టణ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ చలమయ్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. చలమయ్య మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తూముకుంట రామాంజనేయులు అనే వ్యక్తి కోటి రూపాయల వరకు మోసం చేశాడని కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. సీఐ రెడ్డప్ప, ఎస్సై నాగ మధు తమ కొంపముంచారంటూ చలమయ్య భార్య ఆరోపించారు. న్యాయం చేయకపోగా మనిషి ప్రాణానికి ముప్పు తీసుకువచ్చారంటూ చలమయ్య భార్య కృష్ణవేణి, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి