ప్రజల ప్రాణాలకు భరోసా ఏదీ?

ABN , First Publish Date - 2021-05-07T06:33:13+05:30 IST

ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆసుపత్రికి వచ్చే కరోనా బాధితుల ప్రాణాలు కాపాడటంలో రాష్ట్ర ప్రభు త్వం, స్థానిక ప్రజా ప్రతినిధులు పూర్తిగా విఫల మయ్యారని

ప్రజల ప్రాణాలకు భరోసా ఏదీ?

కొవిడ్‌ బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం

బెడ్లు, ఆక్సిజన కొరత తీర్చడంలో నిర్లక్ష్యం

టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి కందికుంట

కదిరి, మే 6: ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆసుపత్రికి వచ్చే కరోనా బాధితుల ప్రాణాలు కాపాడటంలో రాష్ట్ర ప్రభు త్వం, స్థానిక ప్రజా ప్రతినిధులు పూర్తిగా విఫల మయ్యారని కరోనా రోగులకు భరోసా కూడా ఇవ్వలేక పోయారని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇనచార్జ్‌ కందికుంట వెంకటప్రసాద్‌ విమర్శిం చారు. గురువారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేక రుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వేలాది మంది రోగులు రోజూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆసుపత్రికి వస్తున్నారని, వీరిలో ఆక్సిజన కొరతతో, వెంటిలేటర్‌లు లేక వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆ వేదన వ్యక్తం చేశారు. వారిని రక్షించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫల మైందన్నారు. కనీసం కరోనా రోగుల్లో భరోసా నింపడానికి ముఖ్య మంత్రి మీడియా సమక్షంలో కూడా ఒక్క మాటకూడా మా ట్లాడలే దన్నారు. పైగా ఈ విపత్కర సమయంలో ప్రజల దృష్టి మర ల్చేందు కు జూన 1న ఇళ్ల నిర్మాణం ప్రారంభించాలని అధికారులను ఆ దేశిస్తున్నారు. లాక్‌డౌనలో పనులు దొరుకుతాయని ముఖ్యమంత్రి చెప్ప డం విడ్డూరంగా ఉందన్నారు.  స్థానికంగా ప్రభుత్వ ఆసుపత్రులలో కనీస సౌకర్యాలు లేక రోజుకు ఇద్దరు , ముగ్గురు చనిపోతున్నారని, గతంలో వెంటిలేటర్‌లు ఏర్పాటు చేయాలని ముందే సూచించా మన్నారు. స్థానిక ప్రజాప్రతినిధి వాటిని పెడచెవిన పెట్టారన్నారు. ప్రజా ప్రతినిధి సంవత్సర కాలం పాటు సోలార్‌ హబ్‌లో కమీషన్ల కోసం కాలం వెల్లబుచ్చారని ఆరో పించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో భోజనాలు అందించే కాంట్రాక్ట్‌లు మొదలు కుని, సిటీ స్కాన వరకు ప్రజా ప్రతినిధి బంధువులే ఉ న్నారని ఆరోపించారు.     కరోనా లక్షణాలతో బాధపడుతూ ఆసుప త్రికి వస్తే కరోనా కిట్‌లు లేవంటూ, సిటీ స్కాన చేయించుకోవాలని స్థాని కంగా ఉన్న ఓ సెంటర్‌ పేరు చెప్పి పంపుతున్నారని, ఇది ఎంత దౌర్భాగ్యమో ప్రజలు ఆలో చించాలన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధి సంపాదనే ధ్యేయంగా పనిచే స్తున్నారని ఆరోపించారు. కరోనా బాధితులను ఆదుకోవడంలో ప్రభు త్వం, అధికార యంత్రాంగం విఫలం అయ్యిందని, ఇటువంటి పరిస్థితు ల్లో మంత్రి శంకరనారాయణ సీఎం జపం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం జగన కరోనాను అరికట్టడంలో అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. జిల్లాలో కరోనా విజృంభించి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వాటిపై శ్రద్ధ చూపా ల్సింది పోయి సీఎంను జపించడం విడ్డురంగా ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, స్థానిక ప్రజా ప్రతినిఽధులు కరోనాను అరికట్టడంలో యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలన్నారు. 


Updated Date - 2021-05-07T06:33:13+05:30 IST