చంద్రబాబు అరె్‌స్టపై ప్రత్తిపాడులో టీడీపీ నిరసన

ABN , First Publish Date - 2021-03-02T05:51:36+05:30 IST

ప్రత్తిపాడు, మార్చి 1: టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబును రేణిగుంటలో సోమవారం పోలీసులు అరెస్ట్‌ చేయడాన్ని నిరసిస్తూ ప్రత్తిపాడులో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ వరుపుల రాజా పిలుపు మేరకు గ్రామంలో ప్రద

చంద్రబాబు అరె్‌స్టపై ప్రత్తిపాడులో టీడీపీ నిరసన
ప్రత్తిపాడులో ధర్నా చేస్తున్న నాయకులు, కార్యకర్తలు

ప్రత్తిపాడు, మార్చి 1: టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబును రేణిగుంటలో సోమవారం పోలీసులు అరెస్ట్‌ చేయడాన్ని నిరసిస్తూ ప్రత్తిపాడులో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ వరుపుల రాజా పిలుపు మేరకు గ్రామంలో ప్రదర్శన నిర్వహించి కళామందిర్‌ సెంటర్‌లో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. చంద్రబాబును అక్రమంగా, అన్యాయంగా అరెస్ట్‌ చేశారంటూ నినాదాలు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో విపక్ష నేతలకు కూడా భధ్రత కరువైందని, తమ పార్టీ నాయకులపై తప్పుడు కేసులు బనాయించి అక్రమ అరె్‌స్టలకు పాల్పడుతున్నారని వారు విమర్శించారు. ఆందోళనలో ఏఎంసీ మాజీ చైర్మన్‌ కొమ్ముల కన్నబాబు, నియోజకవర్గ సీబీఎన్‌ఆర్మీ కోఆర్డినేటర్‌ యాళ్ల జగదీష్‌, మాజీ సర్పంచ్‌ మూరా వరప్రసాద్‌, టీడీపీ నాయకులు పోలిశెట్టి శ్రీను, మదినే దొరబాబు, వెలుగుల నాని, మూరాచిన్న మదినే స్వామి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-02T05:51:36+05:30 IST