ltrScrptTheme3

అరచేతిలో.. ‘ఆరోగ్య సేతు’!!

Apr 15 2020 @ 10:28AM

కరోనా గండాన్ని దాటించే యాప్‌

పాజిటివ్‌ రోగులు పరిసరాల్లో సంచరిస్తే ఫోన్‌కు రెడ్‌ అలర్ట్‌

మోదీ చెప్పిన సప్త సూత్రాల్లో ఇదీ ఒకటి 


‘ఆరోగ్యసేతు యాప్‌ను ప్రతిఒక్కరు మొబైల్‌లో తప్పకుండా డౌన్‌లోడ్‌ చేసుకోండి’.. ఇది రెండోదశ లాక్‌డౌన్‌ ప్రకటన సందర్భంగా ప్రధాని మోదీ మంగళవా రం దేశ ప్రజలకు చెప్పిన సప్త సూత్రాల్లో ఒకటి. ఈ యాప్‌ను విడుదల చేసిన ఏప్రిల్‌ 1వ తేదీ నుంచే పత్రికలు, టీవీ చానళ్లు, డిజిటల్‌ మీడియాలో ప్రకటన ల ద్వారా కేంద్ర ప్రభుత్వం దీనిపై విస్తృత ప్రచారం చేస్తోంది. ఫలితంగా 14 రోజుల్లోనే కోటి మంది ‘ఆరోగ్యసేతు’ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఇంతకీ ఈ యాప్‌ ఎలా పనిచేస్తుంది? డౌన్‌లోడ్‌ చేసుకున్న వారికి లాభమేంటి? దీని వాడకంతో వ్యక్తిగత సమాచార గోప్యతకు భంగం కలుగుతుందనే ప్రచారం నిజమేనా?


ఇతర యాప్‌లలాగే ఆరోగ్యసేతు యాప్‌ను కూడా గూగుల్‌ ప్లేస్టోర్‌, యాపిల్‌ యాప్‌ స్టోర్ల నుంచి డౌన్‌ లోడ్‌ చేసుకోవచ్చు. ఇది ఇంగ్లి్‌షతో పాటు 10భారతీయ భాషల్లో అందుబాటులో ఉంది. కేంద్ర ఎలకా్ట్రనిక్స్‌, ఐటీ శాఖ దీన్ని అభివృద్ధి చేసింది. మీరు ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటే.. మీ పరిసరాల్లో కరోనా పాజిటివ్‌ వ్యక్తి కదలాడితే వెంటనే మీకు అలర్ట్‌ వస్తుంది. దీంతో మీరు అప్రమత్తమై ఇన్ఫెక్షన్‌ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. ఇంతకూ మన పరిసరాల్లో కదలాడే కరోనా పాజిటివ్‌ రోగి సమాచారం యాప్‌కు ఎలా చేరుతుంది? మనల్ని ఎలా అప్రమత్తం చేస్తుంది? ఈ సందేహాలు పోవాలంటే ఆరోగ్యసేతు యాప్‌ ఇన్‌స్టాలేషన్‌ ప్రాసెస్‌ గురించి తెలుసుకోవాలి. యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసేందుకు బ్లూటూత్‌, లొకేషన్‌లను ఆన్‌ చేయాల్సి ఉంటుంది. ‘లొకేషన్‌ షేరింగ్‌’లో ‘ఆల్వేస్‌’ ఆప్షన్‌ను ఎంపిక చేయాలి. దీంతో యాప్‌ ఇన్‌స్టాలేషన్‌ పూర్తవుతుంది. ఇక లోపలికి ప్రవేశించగానే కరోనా లక్షణాలు మీకు ఉన్నాయా? లేదా? అనేది తేల్చే పలు ప్రశ్నలకు సమాధానాలు నమోదు చేయాలి. ఇందుకు 20 సెకన్లు కేటాయిస్తే చాలు. కరోనా లక్షణాలు ఉన్నాయని తేలితే వెంటనే ప్రభుత్వ సర్వర్‌కు సమాచారం వెళ్లిపోతుంది. దీని ఆధారంగా అధికార యంత్రాంగం సదరు వ్యక్తి లొకేషన్‌ను గుర్తించి, అతడిని ఐసొలేషన్‌ చేసే ప్రక్రియను ప్రారంభిస్తాయి. ఇలాంటి వారి సమాచారం యాప్‌లో నిక్షిప్తమై ఉంటుంది. అటువంటి వాళ్లు వైద్య యంత్రాంగానికి చిక్కకుండా తిరుగుతూ.. మీ పరిసరాల్లోకి వస్తే బ్లూటూత్‌, అల్గారిథమ్‌, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ల ఆధారంగా గుర్తించి మీ మొబైల్‌లోని ‘ఆరోగ్యసేతు’ యాప్‌ అలర్ట్‌ టోన్‌ను వినిపిస్తుంది.


వ్యక్తిగత సమాచారం గోప్యమేనా? 

ఆరోగ్యసేతు యాప్‌తో వ్యక్తులపై నిఘా పెడతారని.. వారి ఫోన్‌లలోని వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి క్లౌడ్‌ సర్వర్‌లో భద్రపరిచే అవకాశాలు ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇటీవల ఓ వార్తాపత్రికలోనూ కథనం ప్రచురితమవడంతో ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో(పీఐబీ) ఫ్యాక్ట్‌చెక్‌ టీమ్‌ వివరణ ఇచ్చింది. నిఘా కోసం ఆరోగ్యసేతు యాప్‌ను వాడతారనే ఆరోపణ నిరాధారమైందనిస్పష్టంచేసింది.  


అంతర్జాతీయ ప్రమాణాలతో సరితూగడం లేదు : ఐఎ్‌ఫఎఫ్‌

ఆరోగ్యసేతు యాప్‌ మౌలిక అంశాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో సరితూగడం లేదని ఇంటర్నెట్‌ ఫ్రీడం ఫౌండేషన్‌(ఐఎ్‌ఫఎఫ్‌) వాదిస్తోంది. వినియోగదారుడి ఏ సమాచారాన్ని సేకరిస్తారు? ఏ ప్రభుత్వ శాఖలు వినియోగిస్తాయి? దుర్వినియోగానికి బాధ్యత ఎవరిది? కరోనా విపత్తు ముగియగానే సమాచారాన్ని తొలగిస్తారా? అనే అంశాలపై స్పష్టత కావాలని ఐఎ్‌ఫఎఫ్‌ అంటోంది. 


- సెంట్రల్‌ డెస్క్‌

Follow Us on:

Health Latest newsమరిన్ని...

ప్రత్యేకంమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.