అంత్యక్రియలకు యువతరం సేవా సమితి సాయం

Dec 7 2021 @ 01:09AM
రమేష్‌ పాడిమోస్తున్న యువతరం సేవాసమితి సఽభ్యులు

శ్రీకాళహస్తి, డిసెంబరు 6: ఆర్థిక ఇబ్బందులతో ఓ పేద వ్యక్తి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించలేమని బంధువులు తేల్చిచెప్పడంతో, యువతరం సేవాసమితి సభ్యులు సాయం చేశారు. వివరాలివీ.. శ్రీకాళహస్తికి చెందిన రమేష్‌ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆయనకు సమీప బంధువులున్నా ఒంటరిగానే జీవిస్తున్నాడు. కాగా, ఆదివారం ఆయన మృతిచెందడంతో ఆ సమాచారాన్ని వన్‌టౌన్‌ కానిస్టేబుల్‌ మునస్వామి రమేష్‌ బంధువులకు వివరించారు. వారు ఆర్థిక పరిస్థితులతో ముందుకు రాకపోవడంతో, యువతరం సేవాసమితి సభ్యులు చొరవ చూపి రమేష్‌ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.