వైరస్‌ నియంత్రణకు మార్గాలు అన్వేషించాలి

ABN , First Publish Date - 2021-04-18T06:11:18+05:30 IST

కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దానిపై శాస్ర్తీయ పద్ధతిలో అధ్యయనం చేస్తూ, నియంత్రణకు మార్గాలు అన్వేషించాలని కొవిడ్‌ జిల్లా ప్రత్యేకాధికారి, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ప్రవీణ్‌కుమార్‌.. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. శ

వైరస్‌ నియంత్రణకు మార్గాలు అన్వేషించాలి
మాట్లాడుతున్న జిల్లా కొవిడ్‌ ప్రత్యేకాధికారి ప్రవీణ్‌కుమార్‌

లోతుగా విశ్లేషణ చేయకపోతే మరింత నష్టం

కొవిడ్‌ జిల్లా ప్రత్యేకాధికారి,

 స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ప్రవీణ్‌కుమార్‌

అనంతపురం, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దానిపై శాస్ర్తీయ పద్ధతిలో అధ్యయనం చేస్తూ, నియంత్రణకు మార్గాలు అన్వేషించాలని కొవిడ్‌ జిల్లా ప్రత్యేకాధికారి, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ప్రవీణ్‌కుమార్‌.. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన జిల్లా కలెక్టర్‌ గంధం చం ద్రుడితో కలిసి కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో కొవిడ్‌పై నోడల్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ జిల్లాలో వైరస్‌ వ్యాప్తిపై లోతుగా విశ్లేషణ చేయకపోతే మరింత నష్టం కలుగుతుందన్నారు. చైనా, యూకే, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌ స్ర్టెయిన్‌ వైర్‌సలు ప్రవేశించాయంటున్నారన్నారు. జిల్లాలో ఏ స్ర్టెయిన్‌ వైరస్‌ వ్యా పించిందో లేదా... ఇంతకు ముందు ఉన్న వైరస్‌ వస్తోందా.. అన్న విషయాన్ని పాజిటివ్‌ నిర్ధారణ అయిన వారి నుంచి శాస్ర్తీయ పద్ధతిలో అధ్యయనం చేసి, తెలుసుకోవాలన్నారు. అందుకు తగిన విధంగా చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయవచ్చన్నారు. కొన్ని కేసుల్లో పాజిటివ్‌ అని తెలియకపోవడం, తెలుసుకునేలోపు ప్రాణానికి ప్రమాదం వాటిల్లుతోందన్నారు. ఈ అంశాలపై ప్రధానంగా దృష్టి సారించాలని ఆయన వైద్యఆరోగ్యశాఖాధికారులను ఆదేశించారు. కరోనా సెకెండ్‌ వేవ్‌పై కొంత పరిజ్ఞానం అవసరమన్నారు. జిల్లాలో కొవిడ్‌ వ్యాప్తిని అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్‌ వివరించారు. కొత్త రకం స్ర్టెయిన్‌ వైరస్‌ వ్యాప్తి చెందకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రవీణ్‌కుమార్‌ దృష్టికి తీసుకెళ్లారు. సమావేశంలో జేసీలు నిశాంత్‌కుమార్‌, గంగాధర్‌ గౌడ్‌, డీఎ్‌ఫఓ జగన్నాథ్‌ సింగ్‌, డీఎంహెచ్‌ఓ కామేశ్వరప్రసాద్‌, కొవిడ్‌ నోడల్‌ అధికారులు వరప్రసాద్‌, రవీంద్ర, గుణభూషణ్‌రెడ్డి, నిశాంత్‌ రెడ్డి, నరసింహారెడ్డి, పార్వతి, పద్మావతి, శివరాంప్రసాద్‌, వైద్యకళాశాల ప్రి న్సిపాల్‌ నీరజ, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ వెంకటేశ్వరరావు, కమిషనర్‌ మూర్తి, అదనపు డీఎంహెచ్‌ఓ రామసుబ్బారావు, డీఐఓ గంగాధర్‌ రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2021-04-18T06:11:18+05:30 IST