ఏడాదిగా ఇంట్లోనే..

ABN , First Publish Date - 2021-04-18T06:20:34+05:30 IST

అనారోగ్యం, ఆర్థిక సమ స్యలు, మానసిక రోగం ఆ కుటుంబాన్ని అతలాకుతలం చేశాయి.

ఏడాదిగా ఇంట్లోనే..
మాధవి ఒడిలో పడుకున్న కూతురు

బాహ్యప్రపంచాన్ని చూడని తల్లీకూతుళ్లు..

కుటుంబికులందరికీ మానసిక అనారోగ్యం

చెత్తదిబ్బగా మారిన ఇల్లు

పుట్టపర్తి, ఏప్రిల్‌ 17: అనారోగ్యం, ఆర్థిక సమ స్యలు, మానసిక రోగం ఆ కుటుంబాన్ని అతలాకుతలం చేశాయి. దీంతో వారి ఇల్లు చెత్తకుప్పలా మారింది. ఏడాదిగా చెత్తదిబ్బలాంటి ఇంట్లోనే త ల్లీబిడ్డలు ఉంటున్నారు. సత్యనారాయణ, అతడి భార్య మాధవి, కుమార్తె యశోదరమ్య నివాసముంటున్నారు. ఇంత దయనీయమైన పరిస్థితి ఉన్న ఇరుగుపొరుగు వారికి కూడా తెలియలేదు. విషయం తెలుసుకున్న అర్బన్‌ సీఐ బాలసుబ్రహ్మణ్యంరెడ్డి, డాక్టర్‌ నాగరాజునాయక్‌ ఆ ఇంటికెళ్లి, అక్కడి పరిస్థితులు చూసి, విస్తుపోయారు. యజమాని సత్యనారాయణను పలకరించారు. ముందుగా వారిని లోపలికి అనుమతించలేదు. ఎ వరూ లోపలికి రావద్దంటూ కేకలు పెట్టారు. తమ ను ఎప్పుడు చంపేస్తారంటూ 11 ఏళ్ల బాలిక య శోదరమ్య పిచ్చిగా మాట్లాడుతోంది. దీంతో వారు సర్దిచెప్పి, ఆరాతీశారు. 30 ఏళ్ల క్రితమే కర్ణాటకలో ని చింతామణి నుంచి వారు వచ్చారు. ఏడాది క్రి తం స్థానిక గోకులంలోని ఇంద్రప్రస్త అపార్ట్‌మెంట్‌ లో అద్దెకు చేరారు. కొద్దిపాటి అనారోగ్యంతో మాధ వి బాధపడుతుండేది. ఆమె సంరక్షణం నిమిత్తం కుమార్తె యశోదరమ్యను స్కూల్‌ మానిపించారు. తల్లి ఆరోగ్య పరిస్థితిని చూసిన బిడ్డ మానసికంగా కుంగిపోయింది. తండ్రి బయట ప్రైవేటు ఉద్యోగం చేస్తూ తెచ్చిన ఆహారాన్ని తింటూ గడిపేవారు. ముగ్గురికీ మానసిక పరిస్థితి బాగా లేకపోవడంతో తాము నివసిస్తున్నది చెత్తకుప్పలోనని కూడా గ్రహించలేకపోయారు. డాక్టర్‌ నాగరాజానాయక్‌.. ఆర్డీటీ ఏటీఎల్‌ శాంతమ్మతో మాట్లాడారు. వారు వెంటనే స్పందించి, ఆదివారం ఆర్డీటీ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయిస్తామని డాక్టర్‌కు తెలియజేశారు.



Updated Date - 2021-04-18T06:20:34+05:30 IST