మద్యం మత్తే ప్రాణాలు తీసిందా..?

ABN , First Publish Date - 2021-03-03T07:29:25+05:30 IST

ఒక చేతిలో బీరు, మరో చేతిలో కారు స్టీరింగ్‌ పట్టుకుని, అతివేగంతో ముందు వెళ్తున్న ఐషర్‌ వాహనాన్ని ఢీకొని, నలుగురు దుర్మరణం చెందారు.

మద్యం మత్తే ప్రాణాలు తీసిందా..?
డ్రైవింగ్‌ సీటులోనే విగతజీవుడైన మనోజ్‌మిట్టల్‌.. కారులో ఇర్కుపోయిన మృతదేహాలు

ఐషర్‌ వాహనాన్ని వెనుక నుంచి వేగంగా ఢీకొన్న కారు.. నలుగురు దుర్మరణం 

పెనుకొండ రూరల్‌, మార్చి 2: ఒక చేతిలో బీరు, మరో చేతిలో కారు స్టీరింగ్‌ పట్టుకుని, అతివేగంతో ముందు వెళ్తున్న ఐషర్‌ వాహనాన్ని ఢీకొని, నలుగురు దుర్మరణం చెందారు. మండలంలోని కియ పరిశ్రమ సమీపాన సో మవారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. వ్యాపారం నిమిత్తం బెంగళూరు నుంచి అనంతపురానికి వెళుతూ కియ పరిశ్రమ ఎదుట 44వ జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో మ నోజ్‌మిట్టల్‌ (38), మహబూబ్‌ ఆలం (31), ఆంచల్‌సింగ్‌ (21), రేఖ (29) మృతి చెందా రు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నార్త్‌ బెంగళూరు ఆర్‌టీ నగర్‌కు చెందిన మనోజ్‌మిట్టల్‌, బెంగళూరు ప్లాటినం సిటీకి చెందిన మ హబూబ్‌ఆలం గుజిరీ స్టీల్‌ వ్యాపారం చేసుకుని, జీవించేవారు. వీరు ఇద్దరు ఈవెంట్‌ ఆర్గనైజర్లగా పనిచేస్తున్న నార్త్‌ ఢిల్లీకి చెందిన ఆంచల్‌సింగ్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం ముజఫర్‌నగర్‌ వాసి రేఖతో కలిసి సోమవారం సా యంత్రం బెంగళూరు నుంచి వ్యాపార నిమిత్తం కారులో అనంతపురానికి బయల్దేరారు. కియ పరిశ్రమ మెయిన్‌గేట్‌ వద్దకు రాగానే ముందువెళ్తున్న ఐషర్‌ వాహనం స్పీడ్‌బ్రేకర్‌ వద్ద వేగం తగ్గించటంతో వెనుక వైపు నుంచి వస్తున్న కా రు అతివేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో కా రులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న సీఐ శ్రీహరి, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, కియ పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని, కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను క్రేన్‌ ద్వారా బయటకు తీసి, పెనుకొండ ఆస్పత్రికి తరలించారు. మృతు ల బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మనోజ్‌మిట్టల్‌కు భార్య, ముగ్గురు కుమార్తెలున్నారు. మ ద్యం సేవించి, వాహనం నడపటం వల్లే ప్ర మాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

Updated Date - 2021-03-03T07:29:25+05:30 IST