Advertisement

సైకిల్‌ సారథులెవరో?

Sep 23 2020 @ 03:32AM

పాత వారికే పట్టం కట్టేరా?

కొత్త రక్తం ఎక్కించేరా?

టీడీపీ కొత్త కమిటీలపై కొనసాగుతున్న కసరత్తు

27న ప్రకటిస్తారంటూ జోరుగా ప్రచారం

అధినేత నిర్ణయంపై తమ్ముళ్లలో ఉత్కంఠ


అనంతపురం వైద్యం సెప్టెంబరు 22: తెలుగుదేశం పార్టీ పటిష్టత దిశగా రాష్ట్ర అధిష్టానం అడుగులు వేస్తోంది. జిల్లా కమిటీల స్థానంలో ప్రస్తుత పార్లమెంటరీ నియోజకవర్గాల వారిగా కమిటీల ఏర్పాటుకు శ్రీకారం చు.ట్టింది. దీంతో అనంత తమ్ముళ్లలో రథసారథులపై ఉ త్కంఠ మొదలైంది. వైసీపీ ప్రభుత్వం ప్రతి పార్లమెంట్‌ను జిల్లాగా మార్చాలని నిర్ణయం తీసుకుంది. ఈనేపథ్యంలో తెలుగుదేశం పార్టీ జిల్లాలో హిందూపురం, అనంతపురం పార్లమెంటరీ కమిటీలు ఏర్పాటు చేయబోతోంది.


ఇప్పటికే జిల్లా, రాష్ట్ర పార్టీ నాయకులు నూతన కమిటీల ఎంపికపై అధినేత చంద్రబాబుతో చర్చించినట్లు తమ్ముళ్లు చెబుతున్నారు. కమిటీల ప్రకటనకు అధినేత ముహుర్తం ఖరారు చేశారని... ఈనెలాఖరున అది కూడా 27న పార్లమెంటరీ కమిటీల అధ్యక్షుల ప్రకటన చేస్తున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో తెలుగు తమ్ముళ్లలో ఎవరికి అవకాశం ఇస్తారోనని ఉత్కంఠ మొదలైంది.


కంచుకోటలో ఊహించని ఓటమి 

అనంతపురం జిల్లా ఆది నుంచి టీడీపీకి కంచుకోట. అయితే గత శాసనసభ ఎన్నికల్లో ఊహించని విధంగా పార్టీ ఓటమి పాలైంది. కేవలం హిందూపురం నుంచి నందమూరి బాలకృ ష్ణ, ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్‌ మాత్రమే  విజయం సాధించారు. మిగతా 12 స్థానాలు కోల్పోయింది. రెండు ఎంపీ సీట్లు చేజారిపోయాయి.


ఊహించని ఓటమితో తెలుగు తమ్ముళ్లలో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. ఆ తర్వాత జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్న ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ పార్టీకి దూరమయ్యారు. అప్పటి నుంచి జిల్లాలో ఈ కీలక పదివి ఖాళీగా ఉంటోంది. జిల్లా అ ధ్యక్షుడిగా బీకే పార్థసారథి కొనసాగుతూ వస్తున్నారు.


తమ్ముళ్లలో ఉత్కంఠ

జిల్లాలోని పార్లమెంటరీ కమిటీల రథసారథులు ఎవరనే దానిపై ప్రస్తుతం  టీడీపీలో ఉత్కంఠ కొనసాగుతోంది. సీనియర్లకు అవకాశం ఇస్తున్నారా... కొత్త వారిని తెరపైకి తెస్తారా అన్న చర్చసాగుతోంది. జిల్లాలోని రెండు పార్లమెంటరీ కమిటీల అధ్యక్ష స్థానాలను బీసీలకు అప్పగించాలని అధిష్టానం నిర్ణయం తీసుకుంది.


ఆ సమయంలో కొత్త యువ రక్తానికి అవకాశం కల్పిస్తే ఎలా ఉంటుందన్న చర్చ కూడా సాగింది. అలా అవకాశం ఇస్తే అనంతపురం పార్లమెంటు నుంచి తలారి ఆదినారాయణ, వెంకటశివుడు యాదవ్‌, పూల నాగరాజు, హిందూపురం పార్లమెంటు నుంచి కురుబ సబిత, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పేర్లు వినిపిస్తూ వచ్చాయి. అయితే ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం, ఆ పార్టీ నేతలు టీడీపీని దెబ్బతీయడానికి తీవ్రం గా ప్రయత్నిస్తున్నారు. అక్రమ కేసులు బనాయిస్తూ టీడీపీ శ్రేణుల్లో అత్మస్తైర్యం దెబ్బతీస్తున్నారు.


ఇలాంటి పరిస్థితిలో శ్రేణులకు మేమున్నామని భరోసా కల్పించే అధినేతలు కావాల్సి ఉంది. వైసీపీ కుట్రలు ధీటుగా ఎదుర్కోవాంటే సీనియర్లకు అవకాశం కల్పిస్తేనే బాగుంటుందన్న అభిప్రాయాలు జిల్లా నేతల్లో వ్యక్తమైనట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని అధినేత చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్ళినట్లు చర్చించుకుంటున్నారు. ఈనేపథ్యంలో రాష్ట్ర అధిష్టానం బీసీ వర్గాల్లో బలమైన నేతలుగా కొనసాగుతున్న మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు, మాజీ ఎమ్మె ల్యే, ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారఽథి వైపే మొగ్గుచూపినట్లు చెబుతున్నారు. ఈఇద్దరు నేతలకు అధినేత అధ్యక్ష పదవులను అప్పగిస్తే మిగిలిన వారు సైతం ఏకపక్షంగా ఆమోదం తెలిపే అవకాశం అధికంగానే ఉంది.


కొత్తగా ఆశక్తి చూపుతున్న వారు కూడా... కొత్త వారికి అవకాశమిస్తే మాకూ అవకాశం ఇవ్వాలని మాత్ర మే కోరుతున్నారు. దీంతో ఆశావహుల నుంచి కూడా పెద్దసమస్య తలెత్తే అవకాశం లేదు. ఈనేపథ్యంలో ఈనెల 27న రాష్ట్ర కమిటీతో పాటు జిల్లాలోని పార్లమెంటరీ కమిటీల అధ్యక్షులను అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటిస్తున్నట్లు తెలు గు తమ్ముళ్లతో పాటు సోషల్‌ మీడియాలోనూ ప్రచారం సాగుతోంది. పాత కాపులకు అవకాశం కల్పిస్తే అనంతపురం పార్లమెంట్‌ అధ్యక్షుడిగా మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు, హిం దూపురం పార్లమెంట్‌ అధ్యక్షుడిగా బీకే పార్థసారథి ఎంపిక కానున్నారు.


కాలవ శ్రీనివాసులు ఈ పదవి తీసుకోవడానికి కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, అయితే అధినేత చంద్రబాబు ఆయన వైపే ఆసక్తి చూపుతున్నట్లు తమ్ముళ్ళు అంటున్నారు. ఒకవేళ కొత్త వారికి అవకాశం కల్పిస్తే ఎవరికి అధ్యక్ష పీఠం దక్కుతుందోనని తమ్ముళ్లు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.


‘యువత’ రాష్ట్ర అధ్యక్షుడిగా తెరపైకి శ్రీరామ్‌

రాష్ట్ర కమిటీలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్ష పదవిని అనంతపురం జిల్లాకు కేటాయిస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ముందుగా శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌ నాయుడుకు యువత పదవి అప్పగిస్తున్నారని ప్రచారం సాగింది. అయితే ఇప్పుడు అదే కుటుంబానికి చెందిన ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తున్నారని పార్టీ సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది. దీంతో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్ష పదవిని పరిటాల శ్రీరామ్‌కు అప్పగిస్తున్నారనే ప్రచారం అదేస్థాయిలో కొనసాగుతోంది.

Follow Us on:
Advertisement
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.