బీ-ఫాం కోసం ‘విశ్వ’ ప్రయత్నాలు

ABN , First Publish Date - 2021-03-03T07:24:36+05:30 IST

: పురం వైసీపీలో హైడ్రామా నడిచింది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి బీ-ఫాంలు తీసుకొచ్చిన ఎమ్మెల్సీ మహ్మద్‌ ఇక్బాల్‌ మంగళవారం తన వర్గీయులకే బీ-ఫాంలు అందజేసేందుకు జాబితాను సిద్ధం చేశారు.

బీ-ఫాం కోసం ‘విశ్వ’ ప్రయత్నాలు
ఎమ్మెల్సీ ఇంటి ఆవరణలో బైఠాయించిన వైసీపీ శ్రేణులు

పురం వైసీపీలో హైడ్రామా 

ఎమ్మెల్సీ ఇంటివద్ద రోజంతా ఉత్కంఠ

అభ్యర్థుల జాబితా ప్రకటించిన ఎమ్మెల్సీ

నవీన్‌కు ఇవ్వకపోవటంపై ఆగ్రహం 

విశ్వేశ్వర్‌రెడ్డి చెప్పినా.. విన ని ఎమ్మెల్సీ

వెనుదిరిగిపోయిన ఎన్నికల పరిశీలకుడు

తమ నాయకుడికి ఇవ్వాలంటూ నిరసనలు

హిందూపురం టౌన్‌, మార్చి 2: పురం వైసీపీలో హైడ్రామా నడిచింది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి బీ-ఫాంలు తీసుకొచ్చిన ఎమ్మెల్సీ మహ్మద్‌ ఇక్బాల్‌ మంగళవారం తన వర్గీయులకే బీ-ఫాంలు అందజేసేందుకు జాబితాను సిద్ధం చేశారు. దానిని విడుదల చేశా రు కూడా. మొదట 28 మందిని, మరోసారి ఏడుగురి పే ర్లను ప్రకటించారు. సోమవారం వైసీపీ పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌చార్జి నవీన్‌నిశ్చల్‌కు కూడా కొన్ని బీ-ఫాంలు ఇస్తామని ఎన్నికల పరిశీలకుడు విశ్వేశ్వర్‌రెడ్డికి ఎమ్మెల్సీ చెప్పినట్లు నవీన్‌ వర్గీయులు పేర్కొంటున్నారు. ఒక్క బీ-ఫాం కూడా నవీన్‌నిశ్చల్‌కు ఇవ్వకపోవటంతో ఆయన వర్గీయులు అసహనం వ్యక్తం చేశారు. విషయాన్ని విశ్వేశ్వర్‌రెడ్డి దృష్టికి నవీన్‌నిశ్చల్‌ తీసుకెళ్లారు. ఆయన అనంతపురం నుంచి హిందూపురం విచ్చేసి, ఎమ్మెల్సీతో చర్చించారు. అక్కడి నుంచి నవీన్‌ ఇంటికి చేరుకుని, బీ-ఫాంలపై మాట్లాడారు. బీ-ఫాంలు తన చేతికివ్వాల్సిందేనని నవీన్‌ తెగేసి చెప్పారు. ఎమ్మెల్సీ మాత్రం నవీన్‌ వర్గీయులకు కూడా కొంతమందికి తానే ఇస్తున్నాననీ, అయితే బీ-ఫాంలు మాత్రం తనచేతి నుంచే ఇస్తానని పట్టుబట్టారు. దీంతో సర్దిచెప్పేందుకు విశ్వేశ్వర్‌రెడ్డి ప్రయత్నించగా.. ఫలితం లేకుండా పోయింది. ఆయ న మంగళవారం రాత్రి ఎమ్మెల్సీ ఇంటి నుంచి బయటికి వచ్చి, నేరుగా అనంతపురానికి వెళ్లిపోయినట్లు సమాచారం. 14వ వార్డులో వైసీపీ తరపున నామినేషన్‌ వేసిన బలరాంరెడ్డి, మధ్యాహ్నం వరకు మెత్తబడినట్లు కనిపించినా ఆ తరువాత ముఖ్యనాయకుల నుంచి ఎమ్మెల్సీకి ఫోన్‌ చేయించారు. ఎలాగైనా తనకు బీ-ఫాం ఇప్పించాలని రాష్ట్ర నాయకుల నుంచి ఒత్తిడి తెప్పించారు. ఈ వార్డుతోపాటు మరో రెండు, మూడు స్థానాల అభ్యర్థులను మార్చాలని డిమాండ్‌ చేశారు. ఉదయమే జాబితా విడుదల చేయటంతో మరోసారి మార్చితే పార్టీకి ఇబ్బందని సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. పట్టణంలోని నాలుగు వార్డులకు ముగ్గురు పోటీలో ఉండటంతో ఎవరికి బీ-ఫాం ఇవ్వాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో బీ-ఫాంలు తగ్గించుకునేందుకు తన అనుచరవర్గంతో వచ్చి నిరసన తెలిపారు. 30వ వార్డు నుంచి వైసీపీ తరపున ఆసిఫ్‌, రహమత్‌, బిలాల్‌ నామినేషన్లు వేశారు. రహమత్‌కు ఎమ్మెల్సీ సూచన ప్రా యంగా చెప్పారన్న సమాచారంతో ఆసిఫ్‌ మంగళవారం రాత్రి ఆయన ఇంటి వద్దకు అనుచరులతో వెళ్లి, ధర్నాకు దిగారు. అంతేకాక ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని, నిప్పంటించుకునేందుకు యత్నిస్తుండగా అక్కడివారు అడ్డుకున్నారు. ఏది ఏమైనా ఎమ్మెల్సీ, నవీన్‌ వర్గీయులు నామినేషన్లు దాఖలు చేయటంతో ఎవరిని ఒప్పించాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్సీ జాబితా విడుదల చేయటం, నవీన్‌ బీ-ఫాంల కోసం పట్టుబట్టడంతో రోజంతా ఉత్కంఠ సాగింది. ఈ పరిస్థితుల్లో జాబితాలో ని పేర్లు అలాగే ఉంచుతారా, మార్పు చేస్తారా అన్నది బుధవారం తేలనుం ది. ఎన్నికల పరిశీలకుడిగా వచ్చిన విశ్వేశ్వర్‌రెడ్డి విశ్వ ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయిందని వైసీపీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2021-03-03T07:24:36+05:30 IST