ఏటీఎంలో చోరీకి విఫలయత్నం

ABN , First Publish Date - 2021-01-22T06:01:01+05:30 IST

యాదమరిలోని ఎస్‌బీఐ ఏటీఎంలో చోరీకి గుర్తుతెలియని వ్యక్తి బుఽధవారం రాత్రి విఫలయత్నం చేశాడు.

ఏటీఎంలో చోరీకి విఫలయత్నం
దుండగుడు ధ్వంసం చేయడంతో దెబ్బతిన్న ఏటీఎం


యాదమరి, జనవరి 21: యాదమరిలోని ఎస్‌బీఐ ఏటీఎంలో చోరీకి గుర్తుతెలియని వ్యక్తి బుఽధవారం రాత్రి విఫలయత్నం చేశాడు. ఎస్‌ఐ ప్రతా్‌పరెడ్డి కథనం మేరకు... యాదమరిలోని ఎస్‌బీఐ ఏటీఎం పనిచేయడం లేదని సర్వర్‌ ద్వారా గుర్తించిన హెడ్‌ఆఫీస్‌ సిబ్బంది సంబంధిత క్యాష్‌ ఫిల్లింగ్‌ చేసే భానుప్రకా్‌షకు సమాచారం ఇచ్చారు. ఆయన గురువారం వచ్చి చూడగా ఏటీఎం ధ్వంసమై కనిపించింది. దీనిపై యాదమరి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకుని పోలీసులు కాంప్లెక్స్‌లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. అందులో రాత్రి 1 గంట నుంచి 3.30 వరకు ఓ వ్యక్తి గడ్డపారతో పలుమార్లు ఏటీఎం ఉన్న గదికి వెళ్లి వచ్చినట్లు గుర్తించారు. అనంతరం చిత్తూరు నుంచి వచ్చిన క్లూస్‌టీం నిందితుడి వేలు ముద్రలు సేకరించింది. భానుప్రకాష్‌ ఫిర్యాదు మేరకు కేసుదర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. బుధవారం భానుప్రకాష్‌ రూ.30 లక్షలు ఏటీఎంలో నింపినట్లు సమాచారం. నిందితుడు ఎంత ప్రయత్నించినా ఏటీఎం తెరుచుకోకపోవడంతో డబ్బు చోరీ కాలేదు. కానీ ఏటీఎం పాక్షికంగా దెబ్బతింది. 


కొరవడిన నిఘా

మండల పరిధిలో వరుస చోరీయత్నాలు జరుగుతున్నా పోలీసుల నిఘా కొరవడినట్లు ప్రజలు వాపోతున్నారు. ఈ నెల 16న మండల పరిధిలో మూడు చోట్ల చైన్‌స్నాచర్లు రెచ్చిపోయి మహిళల మెడలో గొలుసుల చోరీకి యత్నించారు. అది మరువక ముందే  ఏటీఎంలో దొంగతనానికి ప్రయత్నించారు. దీంతో ప్రజలు ఎప్పుడు ఏంజరుగుతుందోనని భయపడుతున్నారు.


Updated Date - 2021-01-22T06:01:01+05:30 IST