అటెన్షన

ABN , First Publish Date - 2021-03-03T06:19:47+05:30 IST

హిందూపురంలో మున్సిపల్‌ ఎన్నికల టెన్షన తారస్థాయికి చేరుకుంది. ప్రధాన పార్టీల నుంచి ఒక్కోస్థానానికి ఇ ద్దరు ముగ్గురు చొప్పున బరిలో ఉండటంతో ఎవరు బీ-ఫారాలు అందుకుంటారోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

అటెన్షన
మునిసిపల్‌ కార్యాలయం వద్ద బందోబస్తులు సీఐలు, పోలీసులు

-నేడు ముగియనున్న ఉపసంహరణ 

-వెనువెంటనే గుర్తుల ప్రకటన పార్టీ బీ-ఫాంలపై 

-వైసీపీలో ఉత్కంఠ రసవత్తరంగా ‘పుర’ రాజకీయం


హిందూపురం టౌన, మార్చి 2: హిందూపురంలో మున్సిపల్‌ ఎన్నికల టెన్షన తారస్థాయికి చేరుకుంది. ప్రధాన పార్టీల నుంచి ఒక్కోస్థానానికి ఇ ద్దరు ముగ్గురు చొప్పున బరిలో ఉండటంతో ఎవరు బీ-ఫారాలు అందుకుంటారోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బరిలో ఎవరు ఉంటారు, ఎవరు త ప్పుకుంటారనే దానిపై సస్పెన్షన నెలకొంది. మంగళవారం ఉపసంహరణ జరిగినాకానీ కేవలం 26 మంది మాత్రమే నామినేషనను ఉపసంహరించుకున్నారు. 38 వార్డులకు సంబంధించి 355 నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే బుధవారం ఉపసంహరణకు ఆఖరి గడువు కావడంతో సాయంత్రానికల్లా ఎవరు పోటీలో ఉంటారనేది తెలిసిపోతుంది. ఆ తరువాత అధికార యంత్రాంగం తుదిజాబితాను విడుదల చేయడంతోపాటు గుర్తులు కేటాయించనుంది. దీంతో అభ్యర్థులతోపాటు ఆశావహుల్లో కూడా టెన్షన ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు ఓవైపు పార్టీ అభ్యర్థులను ఎంపిక చేస్తూనే మరోవైపు అసమ్మతి నాయకులను బుజ్జగిస్తున్నారు. వారికి హా మీలు ఇస్తూ పార్టీఎంపిక చేసిన వారి విజయానికి సహకరించాలని కోరుతున్నారు. బుధవారం ఒక్కరోజే గడువు ఉండటంతో నాయకులతో తీవ్ర ఉత్కం ఠ నెలకొంది. ఓ వైపు ఎమ్మెల్యే బాలకృష్ణ వెంట టీడీపీ అభ్యర్థులు, ఆశావహులు, మంతనాలు జరుపుతుండగా ఎమ్మెల్సీ ఇక్బాల్‌ ఇంటివద్ద వైసీపీ శ్రేణులు బీ-ఫారాలకోసం పడిగాపులు కాస్తున్నారు. దీంతోపాటు పార్లమెంట్‌ వైసీపీ అధ్యక్షులు నవీన వర్గీయులు కూడా బరిలో ఉండటంతో ఆయన కార్యాలయం ఇంటివద్దకూడా వర్గీయులు పడిగాపులు కాస్తున్నారు. ఏది ఏమైనా మంగళవారం ఉదయం నుంచి హిందూపురంలో ప్రధాన పార్టీల్లో వేడి పుట్టింది. కీలకమైన వార్డుల్లో టీడీపీ, వైసీపీ, బీజేపీ, ఎంఐఎం పార్టీలు బరిలో ఉన్నాయి. దీంతో కొన్నిచోట్ల త్రిముఖ, మరికొన్నిచోట్ల బహుముఖ పో టీలున్నాయి. ఇదిలా ఉంటే బుధవారం సాయంత్రం ఉపసంహరణ తరువాత అభ్యర్థులకు గుర్తులు కేటాయించనున్నారు. వెంటనే ప్రచారానికి రం గంలోకి దిగనున్నారు. దీంతో ఆ సమయం నుండి పట్టణంలో మైకులు హోరెత్తనున్నాయి. 

మొదటి రోజు 26 నామినేషన్ల ఉపసంహరణ 

మొదటిరోజు మంగళవారం 26 నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఇందులో టీడీపీకి సంబంఽధించి 14, వైసీపీకి సంబంధించి 8, ఇతరులకుసంబంధించి 4, నామినేషన్లు వెనక్కు తీసుకున్నారు. ఉపసంహరణ సందర్భంగా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఎన్నికల నిబంధనల మేరకు డీఎ్‌సపీ మహబూబ్‌బాష ఆధ్వర్యంలో సీఐలు బాలమద్దిలేటి, మన్సూరుద్దీన, అస్రార్‌బా షా, ధరణికిషోర్‌లు, పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 



Updated Date - 2021-03-03T06:19:47+05:30 IST