ఆడిట్‌ ప్రక్రియను సక్రమంగా చేపట్టాలి

ABN , First Publish Date - 2022-09-24T05:10:48+05:30 IST

ఆలయాల్లో ఆడిట్‌ ప్రక్రియను సక్రమంగా చేపట్టాలని రాష్ట్ర దేవాలయ పరిపాలన సంస్థ డైరెక్టర్‌ రామచంద్రరావు పేర్కొన్నారు.

ఆడిట్‌ ప్రక్రియను సక్రమంగా చేపట్టాలి
మాట్లాడుతున్న రాష్ట్ర దేవాలయ పరిపాలన సంస్థ డైరెక్టర్‌ రామచంద్రరావు

రాష్ట్ర దేవాలయ పరిపాలన సంస్థ డైరెక్టర్‌ రామచంద్రరావు


అనంతపురం కల్చరల్‌, సెప్టెంబరు 23: ఆలయాల్లో ఆడిట్‌ ప్రక్రియను సక్రమంగా చేపట్టాలని రాష్ట్ర దేవాలయ పరిపాలన సంస్థ డైరెక్టర్‌ రామచంద్రరావు పేర్కొన్నారు. శుక్రవారం రాష్ట్ర దేవాలయ పరిపాలన సంస్థ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని కాశీవిశ్వేశ్వర కోదండరామాలయ కల్యాణమండపంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఇనస్పెక్టర్లు, కార్యనిర్వహణాధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆడిట్‌ ప్రక్రియ, కోర్టుకేసులు, ఆలయాల్లో క్రౌడ్‌ మేనేజ్‌మెంట్‌, పండుగల నిర్వహణ అంశాలపై అవగాహన కల్పించారు. రామచంద్రరావు మాట్లాడుతూ దేవదాయ శాఖ రాష్ట్ర అధికారుల ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాల్లోనూ ఆడిట్‌ ప్రక్రియ నిర్వహిస్తున్నా మన్నారు. ఆలయానికి సంబంధించిన మాన్యం భూములు, అద్దెగదులు వంటి వాటి ద్వారా ఆలయానికి ఆదాయం చేకూర్చేలా ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలన్నారు. దేవదాయశాఖ జిల్లా సహాయ కమిషనర్‌ రామాంజనేయులు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌ ఉమాదేవి, సీననియర్‌ ఆడిటర్‌ చంద్రశేఖర్‌రెడ్డి, ఇనస్పెక్టర్‌ లక్ష్మీనారాయణ, అనంతపురం - శ్రీసత్యసాయి జిల్లాల కార్యనిర్వహణాధికారులు పాల్గొన్నారు.


Updated Date - 2022-09-24T05:10:48+05:30 IST