ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన

ABN , First Publish Date - 2022-07-01T05:27:09+05:30 IST

రోడ్డు భద్రత, ట్రాఫిక్‌ నియమ నిబంధనలు, మోటార్‌ వాహనాల చట్టాలపై సిద్దిపేట క్యాబ్‌ డ్రైవర్ల అడ్డా వద్ద గురువారం సిద్దిపేట ట్రాఫిక్‌ ఏసీపీ ఫణింద్ర, సిద్దిపేట ట్రాఫిక్‌ సీఐ రామకృష్ణ అవగాహన కల్పించారు.

ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన

 సిద్దిపేట క్రైం, జూన్‌ 30: రోడ్డు భద్రత, ట్రాఫిక్‌ నియమ నిబంధనలు, మోటార్‌ వాహనాల చట్టాలపై సిద్దిపేట క్యాబ్‌ డ్రైవర్ల అడ్డా వద్ద గురువారం సిద్దిపేట ట్రాఫిక్‌ ఏసీపీ ఫణింద్ర, సిద్దిపేట ట్రాఫిక్‌ సీఐ రామకృష్ణ అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించాలని ట్రాఫిక్‌ ఏసీపీ ఫణీంద్ర సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం కలెక్టర్‌, కమిషనర్‌  ఆధ్వర్యంలో ప్రమాదాల నివారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అవగాహన కార్యక్రమంలో క్యాబ్‌ డ్రైవర్ల అసోసియేషన్‌ అధ్యక్షుడు రాజిరెడ్డి, సెక్రెటరీ మహేష్‌, యూనియన్‌ మాజీ ప్రెసిడెంట్‌ తిరుపతిరెడ్డి, ట్రాఫిక్‌ ఎస్‌ఐ షకీల్‌ హైమాద్‌, ట్రాఫిక్‌ సిబ్బంది పాల్గొన్నారు.


 

Updated Date - 2022-07-01T05:27:09+05:30 IST