బాబు జగ్జీవన్‌రామ్‌ సేవలు మరువలేనివి

ABN , First Publish Date - 2022-07-06T05:30:00+05:30 IST

బాబు జగ్జీవన్‌రామ్‌ సేవలు మరువలేనివి

బాబు జగ్జీవన్‌రామ్‌ సేవలు మరువలేనివి
కీసర రూరల్‌ : చీర్యాల్‌ చౌరస్తాలో జగ్జీవన్‌ రామ్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పిస్తున్న కీసర మండల అంబేద్కర్‌ సంఘం నాయకులు

వికారాబాద్‌/కులకచర్ల/మేడ్చల్‌/ఘట్‌కేసర్‌ రూరల్‌/కీసర రూరల్‌/శామీర్‌పేట, జూలై 6 : దళితుల శ్రేయస్సు కోసం జీవితాన్ని అంకితం చేసిన దళిత సింహం బాబు జగ్జీవన్‌రామ్‌ అని, ఆయన దేశానికి చేసిన సేవలు మరువలేనివని వికారాబాద్‌ మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ మంజులా రమేష్‌, తదితరులు పేర్కొన్నారు. బుధవారం జగ్జీవన్‌రామ్‌ వర్ధంతి సందర్భంగా వికారాబాద్‌లో ఆయన చిత్రపటానికి చైర్‌పర్సన్‌ పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, మాజీ మునిసిపల్‌ వైస్‌చైర్మన్‌ చిగుళ్లపల్లి రమేష్‌, మార్కెట్‌ కమిటీ వైస్‌చైర్మన్‌ మేక చంద్రశేఖర్‌రెడ్డి, కౌఐన్సిలర్‌ అనంత్‌రెడ్డి, ఉద్యమ నాయకుడు సురేష్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు వేణుగోపాల్‌, జగదీశ్‌, గాండ్ల మల్లికార్జున్‌, సర్వేశం, ఫారూఖ్‌ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా జగ్జీవన్‌రామ్‌ వర్ధంతిని చౌడాపూర్‌ మండల కేంద్రంలో అంబేద్కర్‌ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. ఎంపీటీసీ శంకర్‌, నాయకులు అశోక్‌, కుమార్‌, మహేశ్‌, తదితరులు పాల్గొన్నారు. బాబూజగ్జీవన్‌ రామ్‌ వర్ధంతిని మేడ్చల్‌లో ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహాలకు, చిట్రపటాలకు పూలమాలలువేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు వక్తలు ఆయన గొప్పదనాన్ని కొనియాడారు. బడుగు, బలహీన వర్గాల అభ్యన్నతికి జగ్జీవన్‌రామ్‌ ఎనలేని కృషి చేశాడని ఘట్‌కేసర్‌ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి తెలిపారు. మండల పరిధిలోని అవుశాపూర్‌లో బుధవారం ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. సర్పంచ్‌ కావేరిమశ్చేందర్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ అయిలయ్యయాదవ్‌, కార్యదిర్శి ఉమాదేవి, వార్డుసభ్యులు బోడిగే శ్రీనివా్‌సగౌడ్‌, మల్లేష్‌, వీరేషం, దివ్యాదయాకర్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ పెద్దోళ్ళ రమేష్‌, నాయకులు మశ్చేందర్‌రెడ్డి, సాయిలు, దయాకర్‌రెడ్డి, వెంక ట్‌రెడ్డి తదితరులున్నారు. అలాగే కీసర మండలం చీర్యాల్‌లో జగ్జీవన్‌రామ్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అంబేద్కర్‌ యువజన సంఘం మండలాధ్యక్షుడు మెరుగు రవీందర్‌, బీఎస్పీ మండల నాయకుడు బోడ జంగయ్య, నాయకులు బాల్‌రాజ్‌, మల్లేష్‌, చీల్లం శ్రీనివాస్‌ తదితరులున్నారు. అదేవిధంగా జగ్జీవన్‌రామ్‌ సేవలు ఎనలేనివని శామీర్‌పేట ఎంపీపీ ఎల్లుబాయి అన్నారు. శామీర్‌పేట మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ ఆఽధ్వర్యంలో ఆయన చిత్రపటానికి ఎంపీపీ పూలమాలవేసి నివాళులర్పించారు. టీఆర్‌ఎస్‌ మండల నాయకుడు బాబు, సిబ్బంది బాలరాజు, పద్మా పాల్గొన్నారు.


Updated Date - 2022-07-06T05:30:00+05:30 IST