శ్రీ సత్య సాయి జిల్లా: కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. నల్లచెరువు మండలం పి కొత్తపల్లిలో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. పట్టాదారు పాసు పుస్తకం ఇవ్వకుండా మూడు సంవత్సరాలుగా అధికారులు కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారని మహేశ్వర రెడ్డి అనే యువకుడు సిద్ధారెడ్డికి ఫిర్యాదు చేశాడు. సమస్యలు పరిష్కరించనపుడు ఈ కార్యక్రమాలు ఎందుకని మహేశ్వర్ రెడ్డి నిలదీశారు. దీంతో వైసీపీ నేత ఒకరు మహేశ్వరరెడ్డి చెంపపై కొట్టారు. ఆ సమయంలో ఎమ్మెల్యే సిద్ధారెడ్డి చూస్తూ నిలబడ్డారు.
ఇవి కూడా చదవండి