త్యాగానికి ప్రతీక బక్రీద్‌

ABN , First Publish Date - 2021-07-21T05:29:44+05:30 IST

త్యాగం భగవంతుడికి సన్నిహితం చేస్తుంది

త్యాగానికి ప్రతీక బక్రీద్‌
ఆమనగల్లులో మేకలు, గొర్రెలను కొనుగోలు చేస్తున్న ముస్లింలు

  • సామాజిక ప్రార్థనలకు ముస్తాబైన ఈద్గాలు
  • ఊపందుకున్న గొర్రెల విక్రయాలు
  • కొనుగోళ్ల దారులతో రద్దీగా మారిన కూడళ్లు


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : త్యాగం భగవంతుడికి సన్నిహితం చేస్తుంది. భగవ దారాధనలో త్యాగాన్ని మించిన మార్గం లేదు. త్యాగంలో సమర్పణ అనే విలువ ఉంటుంది. భగవంతుడికి తన హృదయాన్నేగాక సకల ఇష్టాలను అర్పించి చేరువ కమ్మని ఇస్లాం బోధిస్తుంది. ఇస్లామిక్‌, క్రైస్తవ, యూదు గ్రంథాల ప్రకారం తన ప్రియమైన వస్తు వును త్యాగం చేయమని దేవుడు చెప్పిన ప్పుడు ప్రవక్త అబ్ర హం తన కుమారుడు ఇస్మాయిల్‌ను త్యాగం(బలి) చేయ డానికి సిద్ధపడతాడు. ఆయన త్యాగానికి మెచ్చిన అల్లాహ్‌ ప్రాణత్యాగానికి బదులుగా ఓ జీవాన్ని బలివ్వాలని సూచి స్తారు. అప్పటి నుంచి బక్రీద్‌ రోజున ఖుర్బానీ ఇవ్వడం ఆన వాయితీగా మారింది. ఇందు కోసం బలిచ్చిన జీవాన్ని మూడు భాగాలుగా చేసి ఓభాగం పేదలకు, రెండో భాగం బంధువులకు, మరోభాగం తన కుటుంబం కోసం వినియో గిస్తారు. రంజాన్‌ పండగ మాదిరిగానే ఈద్‌గాలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అనంతరం అల్లాకు మేకను బలిగా ఇస్తారు. నెమరు వేసే జంతువులను మాత్రమే బలి ఇస్తారు. దీన్ని ఖుర్బానీ అంటారు. 


ఈద్గాలు ముస్తాబు..

నేటి బక్రీద్‌ ప్రార్థనలకు జిల్లాలోని ఈద్గాలన్నీ సిద్ధమ య్యాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ వేడుకలు జరుపు కునేందుకు ముస్లింలు అన్నిఏర్పాట్లు చేసుకుంటున్నారు. 


గొర్రెలు, మేకలకు పెరిగిన డిమాండ్‌..

బక్రీద్‌ సందర్భంగా గొర్రెలు, మేకలకు భారీగా డిమాండ్‌ పెరి గింది. గతేడాది 12కిలోల మేకలు, గొర్రెల ధర రూ.8వేలుంటే.. ఇప్పుడు రూ. 13వేల నుంచి రూ.14 వేల వరకు విక్రయిస్తు న్నారు. ఆర్థిక స్థోమతకు అనుగు ణంగా ముస్లిం సోదరులు మేకలు, గొర్రెలను కొనుగోలు చేశారు. బక్రీద్‌ సందర్భంగా రోడ్ల పక్కన గొర్రెలు, మేకలు విపరీతంగా అమ్మకానికి కనిపించేవి. ఈసారి కరోనా మహ మ్మారితో కొంతమేరకు తగ్గాయి. కేజీ మటన్‌ ధర మార్కె ట్‌లో రూ.700 వరకు విక్రయి స్తున్నారు. పెరిగిన ధరల మూలంగా ఖుర్బానీని ఎవరికి దానం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది.



Updated Date - 2021-07-21T05:29:44+05:30 IST