వెదురుబొంగులే విద్యుత్‌ స్తంభాలు!

ABN , First Publish Date - 2021-06-15T05:15:22+05:30 IST

ఇక్కడ కనిపిస్తున్నవి వెదురుబొంగులు. విద్యుత్‌ స్తం భాలకు బదులు వీటిని ఇలా ఏర్పాటుచేశారు. సీతంపేట మండలం పెద్దూరు పంచాయతీ బుగతగూడకు విద్యుత్‌ సౌకర్యం కల్పించారు.

వెదురుబొంగులే విద్యుత్‌ స్తంభాలు!
విద్యుత్‌ స్తంభాల బదులుగా వెదరుబొంగులు ఏర్పాటుచేసిన దృశ్యం



సీతంపేట: ఇక్కడ కనిపిస్తున్నవి వెదురుబొంగులు. విద్యుత్‌ స్తం భాలకు బదులు వీటిని ఇలా ఏర్పాటుచేశారు. సీతంపేట మండలం పెద్దూరు పంచాయతీ బుగతగూడకు విద్యుత్‌ సౌకర్యం కల్పించారు. కానీ పూర్తిస్థాయిలో స్తంభాలు ఏర్పాటుచేయలేదు. దీంతో చిన్నపాటి గాలులకే వైర్లు ఊగి విద్యుత్‌ సరఫరా నిలిచిపోతోంది. దీంతో స్థానిక యువకులు ఇలా వెదురుబొంగులు తా త్కాలికంగా ఏర్పాటుచేశారు. వర్షాకాలం సమీపి స్తుండడంతో ఈదురుగాలులతో తరచూ సరఫ రా నిలిచిపోతోందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణం స్తంభాలు ఏర్పాటుచేయాలని కోరుతున్నారు. దీనిపై   ట్రాన్స్‌కో సబ్‌ ఇంజినీ ర్‌ అనీల్‌కుమార్‌ వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావిం చగా త్వరలో స్తంభాలు  ఏర్పాటు చేస్తామన్నారు. 






Updated Date - 2021-06-15T05:15:22+05:30 IST