దేవాలయంలో దళితుల ప్రవేశానికి అడ్డగింత

ABN , First Publish Date - 2022-01-18T06:05:50+05:30 IST

మండలంలోని గుంజేపల్లిలో రా ముడి ఆలయంలోకి దళితుల ప్రవేశాన్ని అడ్డుకోవటం తో సోమవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. గ్రామం లో ని రామాలయంలోకి సంక్రాంతి పండుగ రోజు కొందరు దళితులు వస్తుండగా అక్కడే ఉన్న అగ్ర వర్ణాలకు చెందిన కొందరు అడ్డుకున్నారు

దేవాలయంలో దళితుల ప్రవేశానికి అడ్డగింత
రామాలయం వద్ద పోలీసులు, అధికారులతో వాగ్వాదానికి దిగిన అగ్రవర్ణాలు, దళితులు

గుంజేపల్లిలో ఉద్రిక్త పరిస్థితి 

స్పెషల్‌ పార్టీ పోలీసుల బందోబస్తు

అధికారులు, పోలీసులతో తీవ్రస్థాయిలో 

వాగ్వాదానికి దిగిన అగ్రవర్ణాలు


నార్పల, జనవరి17: మండలంలోని గుంజేపల్లిలో  రా ముడి ఆలయంలోకి దళితుల ప్రవేశాన్ని అడ్డుకోవటం తో సోమవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. గ్రామం లో ని రామాలయంలోకి సంక్రాంతి పండుగ రోజు కొందరు దళితులు వస్తుండగా అక్కడే ఉన్న అగ్ర వర్ణాలకు చెందిన కొందరు అడ్డుకున్నారు. తమ పెద్దల కాలం నుంచి కూడా దళితులను రాముని ఆలయంలోకి ఎప్పుడు రానివ్వలేదని అడ్డుకున్నారు. దీంతో దళితులు అగ్రవర్ణాల మధ్య ఘర్షణ జరిగి పోలీ్‌సస్టేషనకు పంచాయితీ చేరింది. అగ్రవర్ణాల వారు ఈ పంచాయితీని  ఆలూరు సాంబశివారెడ్డి దగ్గర కు తీసుకెళ్లారు. ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేయడంతో దళి తులు మరోసారి సోమవారం  రాముడి ఆలయం వద్దకు వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న అగ్రవర్ణ కులాల వా రు దాదాపు 100 మందికిపైగా మహిళలను ఆలయం వ ద్దకు పంపి ఒకవైపు దళితులు.. మరోవైపు అధికారులు, పోలీసులతో తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దిగారు. తాము చచ్చినా దళితులను ఆలయంలోకి పంపమని భీష్మించారు. తహసీల్దార్‌ శ్రీధర్‌మూర్తి, సీఐ భాస్కర్‌గౌడ్‌, ఎస్‌ఐ వెంక టప్రసాద్‌ ఎంత సర్దిచెప్పినా అగ్రకులాల వారు వినలే దు. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో స్పెషల్‌ పార్టీ పోలీ సులతో ఎవరినీ ఆలయం వద్దకు రాకుండా బందోబస్తు ని ర్వహించారు. దళిత వర్గానికి చెందిన నియోజకవర్గ ఎమ్మె ల్యే జొన్నలగడ్డ పద్మావతి మూడు రోజుల నుంచి దళితులను ఆలయంలోకి ప్రవేశించకుండా అగ్రవర్ణాల వారు అ డ్డుకున్న విషయం తెలిసినా.. ఎందుకు పట్టించుకోవడం లేదని దళితవర్గాల వారు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై తహసీల్దార్‌ శ్రీధర్‌మూర్తి మాట్లాడుతూ అందరూ కలిసిమెలిసి ఉండాలని, ప్రస్తుత పరిస్థితుల్లో కులమత బేధాలు లేవని మానవజాతి ఒక్క టే ఉందని విషయం అర్థం చేసుకోవాలని సూచించారు. కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో అగ్రవర్ణాల వారు, దళితులు ఎవరికి వారు ఇళ్లలోనే ఉండిపోయారు.


Updated Date - 2022-01-18T06:05:50+05:30 IST