బయోమెట్రిక్‌ హాజరు తప్పనిసరి

ABN , First Publish Date - 2021-07-23T05:42:35+05:30 IST

సచివాలయా ల్లో బయోమెట్రిక్‌ తప్పనిసరని జాయింట్‌ కలెక్టర్‌-2 సుమిత్‌ కుమార్‌ తెలిపారు.

బయోమెట్రిక్‌ హాజరు తప్పనిసరి
మాట్లాడుతున్న జేసీ సుమిత్‌కుమార్‌

 జాయింట్‌ కలెక్టర్‌-2 సుమిత్‌కుమార్‌

పొందూరు: సచివాలయా ల్లో బయోమెట్రిక్‌ తప్పనిసరని   జాయింట్‌ కలెక్టర్‌-2 సుమిత్‌ కుమార్‌ తెలిపారు. గురువారం పొందూరు-3 రాపాక సచివాల యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ప్రభుత్వం రూపొందించిన నిబంధనలు  సిబ్బంది పాటించాలని, సమస్యల పరిష్కారానికి వచ్చే వినతులు పెరగాలని తెలిపారు.  రాపాకలో ప్రభుత్వభవనాల నిర్మాణాలు ప్రారంభం కాకపో వడంపై జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. భవననిర్మాణాలు జరపాల్సిన స్థలాలపై వివాదాలు ఉంటే రెవెన్యూ, సర్వే అధికారులు పరిష్కరించాలని ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్‌ పి.రామకృష్ణ  ఎంపీడీవో మురళీ కృష్ణ  కొంచాడ గిరిబా బు ఉన్నారు.  పాలకొండ: ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ పథకాలు అందాలని విలేజ్‌, వార్డు సెక్రటరీస్‌ డైరెక్టర్‌ షాన్‌ మోహన్‌ సంగిలి ఆదేశించారు.    పాలకొండ నగర పంచాయతీ కార్యాలయంలో  వార్డు వెల్ఫేర్‌, ఎడ్యుకేషన్‌ సెక్రటరీలు, మెప్మా సిబ్బందితో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలుతీరుపై వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వ హించారు. ఈ సందర్భంగా నగర పంచాయతీ కమిషనర్‌ రామారావు మాట్లా డుతూ పారదర్శకంగా ప్రభుత్వ పథకాలను అర్హులందరికీ అందజేస్తున్నామని తెలి పారు.ఫ ప్రభుత్వం ఆగస్టు 15నుంచి  క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ను అమలు చేయ నుందని, ఇందుకు తగిన విధంగా ప్రతిరోజూ ఈ కార్యక్రమంపై అవగాహన కల్పిస్తున్నామని కమిషనర్‌ రామారావు తెలిపారు. పాలకొండలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ  ప్రజల్లో ప్రజారోగ్యం, పారిశుధ్యంపై మార్పువస్తేనే  క్లీన్‌ పాలకొండ సాధ్యమని  తెలిపారు. హోంకంపోస్ట్‌ తయారీపై  అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు.


 


 


Updated Date - 2021-07-23T05:42:35+05:30 IST