ఎల్‌ఆర్‌ఎస్‌కు బ్రేక్‌

ABN , First Publish Date - 2021-11-22T06:48:02+05:30 IST

అక్రమం నుంచి సక్రమం చేసుకునే అవకాశాలకు చెక్‌ పడింది. అక్రమ లేఅవుట్లను క్రమబద్ధీకరించుకునేందుకు లేఅవుట్‌ రెగ్యులరైజేషన స్కీమ్‌(ఎల్‌ఆర్‌ఎ్‌స)కు సంబంధించి ప్రభుత్వం నుంచి ఆదేశాలొస్తాయని ఆశించిన వారికి నిరాశే మిగిలింది.

ఎల్‌ఆర్‌ఎస్‌కు బ్రేక్‌

పెండింగ్‌లోని దరఖాస్తులకే అనుమతి

అక్రమ లేఅవుట్లపై తాజాగా జీఓ జారీ 

1929 దరఖాస్తుల్లో...907కే అనుమతి427 పెండింగ్‌

అహుడాలో ఎల్‌ఆర్‌ఎ్‌సపై కొనసాగుతున్న సందిగ్ధం

అనంతపురం కార్పొరేషన, నవంబరు21: అక్రమం నుంచి సక్రమం చేసుకునే అవకాశాలకు చెక్‌ పడింది. అక్రమ లేఅవుట్లను క్రమబద్ధీకరించుకునేందుకు లేఅవుట్‌ రెగ్యులరైజేషన స్కీమ్‌(ఎల్‌ఆర్‌ఎ్‌స)కు సంబంధించి ప్రభుత్వం నుంచి ఆదేశాలొస్తాయని ఆశించిన వారికి నిరాశే మిగిలింది. క్రమబద్ధీకరణకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను మాత్రమే పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. పట్టణాభివృద్ధి సంస్థల్లో అక్రమ లేఅవుట్లపై ఈనెల 3వ తేదీ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో అహుడా(అనంతపురం-హిందూపురం అర్బన డెవల్‌పమెంట్‌ అథారిటీ) పరిధిలో వేల సంఖ్యలో అక్రమ లేఅవుట్లు వెలిశాయి. అహుడా ఏర్పడక ముందు, ఆ తరువాత ఏర్పాటైనవీ ఉన్నాయి. ఇప్పటికే అక్రమ లేఅవుట్ల జాబితాను అహుడా అధికారులు తమ వెబ్‌సైట్‌లో ఉంచారు. వాస్తవానికి గత ఏడాది ఆరంభంలో అక్రమ లేఅవుట్లను క్రమబద్ధీకరించుకునేందుకు అవకాశం కల్పించారు. ఇందుకు పూర్తిస్థాయిలో స్పందన రాలేదు. గత ఏడాది డిసెంబరు వరకు మాత్రమే ఎల్‌ఆర్‌ఎ్‌సకు దరఖాస్తులు వచ్చాయి. ఈ ఏడాది జనవరి నుంచి దరఖాస్తులను తీసుకోకూడదని ఆదేశాలు వచ్చాయి. దీంతో ఎల్‌ఆర్‌ఎ్‌సల విషయంలో సందిగ్ధత ఏర్పడింది. ఆసందర్భంలో ఎల్‌ఆర్‌ఎ్‌సకు దరఖాస్తు చేసుకున్న వాటి విషయంలో 75 శాతం అప్రూవల్‌ కాగా మిగిలినవి పెండింగ్‌లో ఉండిపోయాయి. ఎల్‌ఆర్‌ఎస్‌ అప్రూవల్స్‌ కూడా నిలిపివేశారు. తాజాగా వాటిని  పూర్తి చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు అవకాశమెప్పుడా..? అని లేఅవుట్ల యజమానులు ఎదురుచూడాల్సిన పరిస్థితి తలెత్తింది. 


1929 దరఖాస్తుల్లో.....907కే అప్రూవల్‌...

అనంతపురం నగరపాలక సంస్థతో పాటు ధర్మవరం, హిందూపురం మున్సిపాలిటీలను కలుపుతూ 2017లో అహుడా  ఏర్పడింది. అహుడా ఏర్పడక ముందే లేఅవుట్లు వెలిశాయి. కానీ వాటిలో 85శాతం పైగా పంచాయతీ నుం చి కానీ డైరెక్టర్‌ ఆఫ్‌ టౌనఅండ్‌ కంట్రీప్లానింగ్‌ (డీటీ సీపీ)నుంచి  కానీ అనుమతుల్లేకుండా ఏర్పాటు చేశారు. అహుడా ఏర్పాటైన తరువాత మరికొన్ని లేఅవుట్లు వెలిశా యి. ఇలా అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన లేఅవుట్లను అక్రమ లేఅవుట్లుగా పరిగణించారు. వాటిని  క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఆ మేరకు 2019 ఆగస్టు 31లోపు ఏర్పాటు చేసిన లేఅవుట్లకు ఎల్‌ఆర్‌ఎస్‌ చేసుకోవాలని ఆదేశాలిచ్చింది. ఆ మేరకు 2020 జనవరి 10న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగా అహుడా పరిధిలో మొత్తం 1929 దరఖాస్తులు అందాయి. కానీ వాటిలో ఇప్పటివరకు 907 దరఖాస్తులకు మాత్రమే అనుమతి లభించింది. అనుమతి ఉంటేనే రిజిస్ర్టేషన చేసుకునే అవకాశం లభిస్తుంది. అందులో 283 దరఖాస్తులను వివిధ కారణాలతో తిరస్కరించారు. 146 దరఖాస్తులను షార్ట్‌ఫాల్స్‌ చూపి పక్కన పెట్టారు. ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు చెల్లించకపోవడంతో మరో 166 దరఖాస్తులు అలాగే ఉండిపోయాయి. ప్రస్తుతం 427 దరఖాస్తులను పరిశీలించాల్సి ఉంది. 2022 మార్చి 31లోపు వాటిని పూర్తి చేయాలని ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొంది. 


పెరిగిన అక్రమ లేఅవుట్లు....

అహుడా పరిధిలో అక్రమ లేఅవుట్లను గుర్తించడంలో ప్రత్యేక దృష్టి సారించారు. అహుడా అధికారులు. అహుడా వైస్‌చైర్మన మురళీకృష్ణగౌడ్‌ ఆదేశాల మేరకు ఈ నెలన్నర వ్యవధిలో 153 అక్రమ లేఅవుట్లను గుర్తించారు.


పెండింగ్‌ దరఖాస్తులను త్వరగా పూర్తిచేస్తాం :  మురళీకృష్ణగౌడ్‌, అహుడా వైస్‌చైర్మన

ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎ్‌సకు అవకాశం ఇచ్చిన సంద ర్భంలో కొందరు అక్రమ లేఅవుట్లను క్రమబద్ధీకరించు కోలేకపోయారు. మరోసారి ఎల్‌ఆర్‌ఎ్‌సకు ప్రభుత్వం ఆదే శాలిచ్చేవరకు వేచిచూడక తప్పదు. ప్రస్తుతం 427దరఖా స్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని వచ్చే నెలాఖరులోపు పూర్తిచేయడంపైనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నాం. 

Updated Date - 2021-11-22T06:48:02+05:30 IST