ఉమ్మడి జిల్లాలో 397 మందికి కరోనా

ABN , First Publish Date - 2020-12-04T05:08:51+05:30 IST

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గురువారం 397 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

ఉమ్మడి జిల్లాలో 397 మందికి కరోనా

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గురువారం 397 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 205, వికారాబాద్‌ జిల్లాలో 12, మేడ్చల్‌ జిల్లాలో 180 కేసులు నమోదయ్యాయి. 


ఇబ్రహీంపట్నం, శంషాబాద్‌లో..

ఇబ్రహీంపట్నం / శంషాబాద్‌ : ఇబ్ర హీంపట్నం డివిజన్‌లో 435 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా ఏడుగురికి పాజిటివ్‌ వచ్చింది. ఇబ్రహీంటప్నం 2, అబ్దుల్లాపూర్‌మెట్‌ 4, హయత్‌నగర్‌లో ఒకరికి పాజిటివ్‌ అని తేలింది. శంషాబాద్‌ మున్సిపల్‌ కేం ద్రంలో 42మందికి కరోనా పరీక్షలు చేయగా ముగ్గురికి పాజిటివ్‌ వచ్చింది.


షాద్‌నగర్‌ డివిజన్‌లో...

షాద్‌నగర్‌: షాద్‌నగర్‌ డివిజన్‌లో 172 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ము గ్గురికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యా ధికారులు తెలిపారు. ముగ్గురిలో షాద్‌నగర్‌ పట్టణానికి చెందిన ఇద్దరు, ఫరూఖ్‌నగర్‌ మండలానికి చెందిన ఒకరు ఉన్నారు.

 

 చేవెళ్ల డివిజన్‌లో..

చేవెళ్ల :  చేవెళ్ల డివిజన్‌ పరిధిలో 213 మందికి కరోనా పరీక్షలు చేయగా ఒకరికి పాజిటివ్‌ వచ్చిందని   వైద్యులు తెలిపారు. చేవెళ్ల, శంకర్‌పల్లి, మొయినాబాద్‌, షాబాద్‌ ఎవరికీ పాజిటివ్‌ రాలేదన్నారు. 


వికారాబాద్‌ జిల్లాలో..

(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌) : వికారాబాద్‌జిల్లాలో కరోనా కేసులు రోజూ వస్తు న్నాయి. మర్పల్లిలో 5, వికారాబాద్‌లో 2, దౌల్తాబాద్‌లో 2, పరిగిలో 2, కొడంగల్‌లో ఒక కరోనా కేసులు నమోదయ్యాయి.


మేడ్చల్‌లో...

మేడ్చల్‌ : మేడ్చల్‌ ప్రభుత్వాసుపత్రిలో 31 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్‌ వచ్చింది. అదేవిధంగా శ్రీరంగవరం పీహెచ్‌సీలో 21 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఎవరికీ పాజిటివ్‌ రాలేదు.

Updated Date - 2020-12-04T05:08:51+05:30 IST