వలస కార్మికులను వెంటాడుతున్న కరోనా

ABN , First Publish Date - 2020-08-07T11:01:38+05:30 IST

లికిరి మండలంలో వలస కార్మికులను కరోనా కబళిస్తోంది. సీఆర్‌పీఎఫ్‌లో ఆరుగురికి నిర్ధారణ కాగా తాజాగా ఐటీబీపీలో ..

వలస కార్మికులను వెంటాడుతున్న కరోనా

 కలికిరిలో 22 పాజిటివ్‌ కేసులు 


కలికిరి, ఆగస్టు 6: కలికిరి మండలంలో వలస కార్మికులను కరోనా కబళిస్తోంది. సీఆర్‌పీఎఫ్‌లో ఆరుగురికి నిర్ధారణ కాగా తాజాగా ఐటీబీపీలో మరో ఇద్దరికి సోకింది. పశ్చిమబెంగాల్‌కు చెందిన వలస కార్మికులు సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీల్లో జరుగుతున్న భవన నిర్మాణ పనుల్లో పాల్గొంటున్నారు. వీరితోపాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన స్థానిక కూలీలు పనుల్లో పాల్గొంటున్నారు. ఈ రెండు  ప్రదేశాల్లో కాంట్రాక్టర్లు సరైన నియంత్రణ చర్యలు తీసుకోకపోవడంతో వలస కార్మికులను కరోనా వెంటాడుతున్నట్లు ఆరోపణలున్నాయి.


కలికిరిలో మొత్తం 22 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య వర్గాలు తెలిపాయి. బుధవారం నుంచి గురువారం సాయంకాలం వరకూ నిర్ధారణ జరిగిన కేసుల్లో అత్యధికంగా పట్టణంలోనే నమోదయ్యాయి. టీబీరోడ్డులో ఇద్దరు దంపతులకు కరోనా సోకగా కుప్పం పీఈఎస్‌ ఆస్పత్రికి తరలించారు. ఇందిరమ్మకాలనీ, టెలిఫోన్‌ ఎక్స్ఛేంజి, ఏఎన్‌ఆర్‌ కాలనీ, నగరిపల్లెల్లో కేసుల సంఖ్య పెరిగిపోతోంది. కలికిరిలో కేసుల తీవ్రత దృష్ట్యా తిరుపతి విష్ణునివాసం డిప్యుటేషన్‌పై వెళ్లిన మేడికుర్తి వైద్యాధికారి చిన్నరెడ్డెప్పను గురువారం తిరిగి రప్పించారు. 

Updated Date - 2020-08-07T11:01:38+05:30 IST