TDP Protest: అనంతలో చంద్రదండు ప్రకాష్ వినూత్న నిరసన

ABN , First Publish Date - 2022-09-03T17:23:32+05:30 IST

కల్తీ మద్యాన్ని అరికట్టాలని డిమాండ్ చేస్తూ టీడీపీ నేత చంద్రదండు ప్రకాష్ నాయుడు వినూత్నరీతిలో నిరసన చేపట్టారు.

TDP Protest: అనంతలో చంద్రదండు ప్రకాష్ వినూత్న నిరసన

అనంతపురం: కల్తీ మద్యాన్ని అరికట్టాలని డిమాండ్ చేస్తూ టీడీపీ నేత (TDP Leader) చంద్రదండు ప్రకాష్ నాయుడు (Chandradandu Prakash naidu) వినూత్నరీతిలో నిరసన చేపట్టారు. నగరంలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్స్చేంజ్ కార్యాలయం ఎదుట ఖాళీ మద్యం సీసాలను మెడలో వేసుకొని టీడీపీ (TDP) కార్యకర్తలతో కలిసి  చంద్రదండు నిరసన వ్యక్తం చేశారు. కల్తీ మద్యంతో సామాన్యుల ప్రాణాలు పోతున్నా సీఎం జగన్మోహన్ రెడ్డి (CM Jagan mohan reddy)కి పట్టదా..? అంటూ ఆందోళన చేపట్టారు. రాష్ట్రం(Andhrapradesh)లో కల్తీ మద్యం ఏరులై పారుతుంటే ఎక్సైజ్ అధికారులు ఏం చేస్తున్నారంటూ  చంద్రదండు ప్రకాష్ నాయుడు ప్రశ్నించారు. 

Updated Date - 2022-09-03T17:23:32+05:30 IST