అక్రమ కేసులతో నా భర్తను అరెస్ట్‌ చేయించారు: వైసీపీ జెడ్పీటీసీ గీత

ABN , First Publish Date - 2022-01-02T21:15:00+05:30 IST

వైసీపీ నేతలు, ప్రత్యర్థి పార్టీ నేతలు, కార్యకర్తలనే కాదు అడ్డువస్తొన్నవారు అనుకుంటే సొంత పార్టీ నేతలను..

అక్రమ కేసులతో నా భర్తను అరెస్ట్‌ చేయించారు: వైసీపీ జెడ్పీటీసీ గీత

చిత్తూరు జిల్లా: వైసీపీ నేతలు, ప్రత్యర్థి పార్టీ నేతలు, కార్యకర్తలనే కాదు అడ్డువస్తున్నారు అనుకుంటే సొంత పార్టీ నేతలను కూడా వేధించకుండా వదిలిపెట్టడంలేదు. తంబళ్లపల్లి జడ్పీటీసీ సభ్యురాలు గీత, తన భర్త వైసీపీ నేత కొండ్రెడ్డిని వైసీపీ ఎమ్మెల్యే ద్వారకానాథ రెడ్డి అక్రమంగా అరెస్టు చేయించారని, సంబంధంలేని కేసులో తన భర్తను అరెస్టు చేయడం దారుణమని ఆమె ఆరోపించారు. ఎమ్మెల్యే ద్వారకనాథ్‌రెడ్డి అరాచకాలు, అక్రమాలపై ప్రశ్నిస్తున్నందుకే.. తమపై కక్ష్య కట్టి ఇలా కేసులు బనాయిస్తున్నారని గీత తెలిపారు. తన భర్తను అరెస్ట్‌ చేసి ఎక్కడికి తరలించారో కూడా తెలియడంలేదని, కుటుంబమంతా ఆందోళనలో ఉన్నామని, ద్వారకనాథ్‌రెడ్డి నుంచి తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని, ఇంటికి ఎవరు వచ్చినా చంపేస్తామని బెదిరిస్తున్నారని గీత తెలిపారు.

Updated Date - 2022-01-02T21:15:00+05:30 IST