జిల్లాలో రోడ్లన్నీ గుంతలమయం

ABN , First Publish Date - 2021-11-15T06:05:50+05:30 IST

జిల్లాలో రోడ్లు అధ్వానస్థితికి చేరాయి. 80శాతానికి పైగా రోడ్లు గుంతలు, గతుకులతో దర్శనమిస్తున్నాయి.

జిల్లాలో రోడ్లన్నీ గుంతలమయం
కలెక్టరేట్‌ ఎదురుగా మడుగును తలపిస్తున్న రోడ్డు

కలెక్టరేట్‌ ముందే.. పెద్ద మడుగు..

ఈ ఫొటోలో చూశారా.. రోడ్డు మధ్యలోనే పెద్దమడుగు. ఇది ఎక్కడైనా లోతట్టు ప్రాంతం అనుకుంటే పొరబాటే. జిల్లా కేంద్రంలోనిది. అది కూడా కలెక్టరేట్‌ ముందే ఈ దుస్థితి నెలకొంది. రోడ్డు పక్కనే పెద్ద గొయ్యి ఏర్పడి, అందులో భారీగా నీరు చేరింది. ఏకంగా మడుగును తలపిస్తోంది. జిల్లా ఉన్నతాధికారులు నిత్యం తిరిగే.. రోడ్డు పరిస్థితే.. ఇంత దారుణంగా ఉంటే.. మిగతాచోట్ల రోడ్లు ఎలా ఉంటాయో.. అంచనా వేసుకోవచ్చు..















సీఎం సారూ.. రోడ్లు ఎక్కడేశారు..?

2 వేల కిలోమీటర్లకు పైగా 

దెబ్బతిన్న రహదారులు

మరమ్మతులకూ నోచుకోని వైనం

వైసీపీ పాలనలో కిలోమీటరు 

కూడా కొత్త రోడ్డు వేయని దుస్థితి

రూ.125 కోట్ల ఎనడీబీ పనులు 

మొదలుపెట్టని వైనం

కాంట్రాక్టర్లలో బిల్లుల భయం

పనులు చేసేందుకు ససేమిరా

అధికారులు బతిమాలినా..

స్పందన శూన్యం..

అయినా రోడ్ల అభివృద్ధికి వేల కోట్లు ఖర్చు చేశామంటున్న ముఖ్యమంత్రి

గతుకుల రోడ్లపై ప్రయాణికుల అవస్థలు


డీజిల్‌, పెట్రోల్‌పై పన్నులు అతి తక్కువగా 

వేశామని ముఖ్యమంత్రి జగన..

పేపర్లలో పెద్దపెద్ద ప్రకటనలే ఇచ్చారు.. 

గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే 

తాము ప్రజలపై స్వల్ప భారమే 

మోపామని ప్రకటించారు..

అది కూడా.. రోడ్ల అభివృద్ధి, మరమ్మతులకేనన్నారు..

వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు..

ఆ లెక్కన జిల్లాలో కొన్నయినా.. 

కొత్త రోడ్లు వేసుండాలి కదా..

కొన్నింటికైనా మరమ్మతులు చేసుండాలి కదా..

ఏ ఊరికి కొత్తగా రోడ్డు వేశారు..?

ఏ ఊరి రోడ్డుకు మరమ్మతులు చేశారు..?

ఏ ఊరికెళ్లినా.. ఛిద్రమైన రోడ్లే దర్శనమిస్తున్నాయి..

అడుగుకో గుంత.. అడుగడుగునా గుంతే..

ప్రయాణమంటేనే జనం భీతిల్లిపోతున్నారు..

వర్షాలకు రోడ్లు ఎక్కడికక్కడ దెబ్బతింటున్నాయి..

కొన్ని కోతకు గురవుతున్నాయి.. 

మరికొన్ని తెగిపోతున్నాయి..

వాటికి మరమ్మతులు చేసేవారు లేరు.. 

తట్టెడు మట్టి వేసేవారు లేరు..

జిల్లాకేంద్రంలోనూ రోడ్లు ఛిద్రమైపోయాయి..

టెండర్లు పిలిస్తే.. కాంట్రాక్టర్లు స్పందించట్లేదు..

అధికారులు బతిమాలినా.. ససేమిరా అంటున్నారు..

పాత బిల్లులే రాలేదు.. 

కొత్తవి ఎప్పుడిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు..

ప్రభుత్వ పనులకు రాం.. రాం.. అంటున్నారు..

పదే.. పదే.. అధికారులు 

టెండర్లు పిలుస్తూ.. అలసిపోతున్నారు..

అయినా.. కొత్త రోడ్లు 

వేశామని సీఎం చెబుతున్నారు..

ఇదెక్కడి చోద్యమో?

ఆయన ఖర్చు చేశామంటున్న 

వేల కోట్లు ఏ‘దారి’న పోయాయో?

ఎవరి జేబులోకి చేరాయో?

సీఎం సారే.. చెప్పాలి..


అనంతపురం కార్పొరేషన, నవంబరు 14: జిల్లాలో రోడ్లు అధ్వానస్థితికి చేరాయి. 80శాతానికి పైగా రోడ్లు గుంతలు, గతుకులతో దర్శనమిస్తున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక కిలోమీటరు కూడా కొత్త రోడ్డు నిర్మించడం పూర్తికాలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మండల కేంద్రాల నుంచి పట్టణాలకు, నియోజకవర్గ కేంద్రాలకు సింగిల్‌ లేన నుంచి డబుల్‌ లేన రోడ్డుగా విస్తరించే ప్రతిపాదన ఏళ్ల నుంచి ఉన్నప్పటికీ ఇంకా అమలుకు నోచుకోలేదు. న్యూ డెవల్‌పమెంట్‌ బ్యాంక్‌ (ఎనడీబీ) నిధులతో టెండర్లు పిలిచారు. కేసీవీఆర్‌ అనే కాంట్రాక్టు సంస్థ టెండర్‌ దక్కించుకుని అగ్రిమెంట్‌ కూడా పూర్తిచేసుకుంది. 8నెలలైనా ఒక్క అడుగు కూడా తారు వేయలేకపోయారు. జిల్లావ్యాప్తంగా వేల కిలోమీటర్లు దెబ్బతిన్నా వాటికి కనీసం మరమ్మతులు కూడా చేయలేని దుస్థితి. అటు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రూ.2025 కోట్ల నిధులతో అభివృద్ధి చేశామని చెబుతోంది. జిల్లాలో గుంతల రోడ్లను చూస్తున్న మేధావి వర్గాలు... అన్ని వేల కోట్లు ఖర్చు చేసింది ఈ రోడ్లమీదేనా సీఎం సారూ...? అని ప్రశ్నిస్తున్నారు.


2వేల కిలోమీటర్లపైనే గుంతల రోడ్లు

జిల్లాలో తెలుగుదేశం పార్టీ పాలనలో వేసిన కొత్త రోడ్లు మినహా దాదాపు అన్ని రోడ్లు ఘో రంగా దెబ్బతిన్నాయి. జిల్లాలో రోడ్లు, భవనాల శాఖ(ఆర్‌అండ్‌బీ) పరిధిలో 4200 కిలోమీటర్ల రోడ్లున్నాయి. అందులో 2వేల కిలోమీటర్లుపైగా రోడ్లు దెబ్బతిన్నాయని ఆ శాఖాధికారులే చెబుతున్నారు. గతంలో వేసిన రోడ్లు వాహనాల రాకపోకలతో, మరికొన్ని వర్షాలు ఎక్కువగా కురిసినందుకు దెబ్బతిన్నాయి. ఏదేమైనప్పటికీ వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో 5 శాతం మాత్రమే మరమ్మతులకు నోచుకున్నాయన్న విమర్శలున్నాయి. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకా్‌షరెడ్డి స్వగ్రామమైన తోపుదుర్తికి వెళ్లే ప్రధాన రహదారి (అనంతపురం-తగరకుంట)లోని గుంతలను చూస్తే వామ్మో అనక తప్పదు. శింగనమల మండలం నుంచి నాయనపల్లి క్రాస్‌ జలాపురం గ్రామం మీదుగా రహదారి విస్తరణకు అప్పట్లో మంత్రి శంకరనారాయణ శంకుస్థాపన చేశారు. నిధులు లేకపోవడంతో కాంట్రాక్టర్‌ పని చేపట్టలేదు.   అనంతపురం నగరంలోని ప్రధాన రహదారులు కొంతకాలంగా గుంతలతో ప్రమాదకరంగా మారా యి. కదిరి నుం చి రాయచోటికి వెళ్లే ప్రధాన రహదారి, యాడికి-వేములపాడు, అనంతపురం-రాప్తాడు, కుం దుర్పిలోని కరిగానపల్లి-అపిలేపల్లిరోడ్డు, అమరాపురం మండలంలోని హేమావతి రోడ్డు,  గుత్తి-పత్తికొండ రహదారి, శింగనమల నుంచి గార్లదిన్నెకు వెళ్లే రహదారి, చిగిచెర్ల నుంచి కందుకూరుకు వెళ్లే రోడ్డు, పుట్టపర్తి మండలం పెడపల్లి నుంచి గంగంపల్లి వరకు, పెద్దవడుగూరు మండలం కిష్టిపాడు నుంచి కొండుపల్లి వరకు వెళ్లే రోడ్డు, మడకశిర నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రహదారులు, యల్లనూరు నుంచి వెన్నపూసపల్లి రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. వజ్రకరూరు మండలం పొట్టిపాడు ప్రధాన రహదారి వర్షానికి కోతకు గురైంది. పట్టించుకోలేదు. బెళుగుప్ప మండలంలో ఎర్రగుడి మట్టిరోడ్డు గుంతలతో దర్శనమిస్తోంది. ఆ రోడ్లమీద వెళ్లే వాహనాలు తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇక వర్షాకాలమొస్తే ఎక్కడ గుంత, ఎంత లోతుందో తెలియక వాటిలో దిగిన వాహనాలు బోల్తాపడుతున్నాయి. దీంతో ఏ టా వందల సంఖ్యలో ప్రయాణికులు తీవ్ర గాయాల పాలవుతున్నారు.


పెండింగ్‌ బిల్లులు...  ప్రారంభంకాని పనులు...

రాష్ట్రవ్యాప్తంగా ఒకే పరిస్థితి. చేసిన పనులకే బిల్లులు కావడం లేదు. కొత్త పనులకు ఎక్కడి నుంచి వస్తాయనేది కాంట్రాక్టర్ల ప్రశ్న. పంచాయతీల నుంచి పట్టణాల వరకు మున్సిపాలిటీల నుంచి నగరపాలక సంస్థ వరకు మొత్తం ఇదే పరిస్థితి. కొత్త పనులకు దేవుడెరుగు పాత పనులకు బిల్లులు వ స్తే చాలనే పరిస్థితుల్లో కాంట్రాక్టర్లున్నారంటే రోడ్ల ప నులు ఎలా ఉంటాయో చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్‌అండ్‌బీ పరిధిలో అత్యవసరం కింద చేసిన పనులకు రూ.10కోట్లు రావాల్సి ఉంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో ఫ్లడ్‌ డామేజ్‌ రిపేర్స్‌ (ఎఫ్‌డీఆర్‌) కింద రూ.7.24కోట్లకు టెండర్లు పిలిచారు. అగ్రిమెంట్‌ ఓకే అయింది. పనులు మాత్రం చేపట్టలేదు. సెంట్రల్‌ రోడ్‌ ఇనఫ్రాస్ట్రక్చర్‌ (సీఆర్‌ఎఫ్‌) ని ధుల కింద రూ.60 కోట్లతో జిల్లాలో ప్రధాన రహదారుల్లో నాలుగు పనులకు సంబంధించి టెండర్లు పిలిచారు. వాటిలో రాయదుర్గం-పెనుకొండ రోడ్డుకు మాత్రమే పను లు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. టీడీపీ హ యాంలో సెంట్రల్‌ ఫండ్స్‌ అధి కంగా వచ్చేవని, కానీ ఇప్పుడా పరిస్థితి లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇక పంచాయతీరాజ్‌ పరిధిలో నేటికీ 350వరకు గ్రామాల మధ్య తారురోడ్లు లేవంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. తాజాగా కొంత నిధులతో పలుగ్రామాల మధ్య కొత్త రోడ్లు వేసినట్లు ఆ శాఖాధికారులు చెబుతున్నారు.


మొదలుకాని రూ.125 కోట్ల ఎనడీబీ పనులు

వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో రాష్ట్రవ్యాప్తంగా ఎనడీబీ నిధులతో డబుల్‌లేన రోడ్లకు టెండర్లు పిలిచింది. ఆ మేరకు జిల్లాలో రాయదుర్గం-కణేకల్లు, కంబదూరు-పేరూరు, అనంతపురం-విరుపసముద్రం, అనంతపురం-తగరకుంట, రాజంపేట-కదిరి, పెనుకొండ-ముదిగుబ్బ-దొరిగల్లు రోడ్డు విస్తరణ పనులకు రూ.128 కోట్లతో కేసీవీఆర్‌ సంస్థ కా ంట్రాక్టు దక్కించుకుంది. టెండరు ప్రక్రియ ముగిసి కాంట్రాక్టు ఒప్పం దం (అగ్రిమెంట్‌) కావడానికి మరికొంత ఆలస్యమైంది. పనులు దక్కించుకున్న ఆ సంస్థ ఒక కిలోమీటర్‌ కూడా రోడ్డు వేయలేదు. పనులు ఆ లస్యం కావడానికి బిల్లులు అవుతాయో లేదోననే సందిగ్ధంలో కాం ట్రాక్టు సంస్థ ఉన్నట్లు తెలుస్తోంది. ఇన్ని రూ.కోట్ల పనులకు సంబంధిం చి టెండర్‌ ముగిసినా పని ప్రార ంభం కాకపోవడం ఇదే ప్రప్రథమని ఆ శాఖవర్గాలే పేర్కొంటున్నాయి.


ఏడుసార్లు టెండర్లు పిలిచినా.. స్పందన కరువు..

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఏడుసార్లు టెండర్లు పిలిచినా నో రెస్పాన్స. టెండర్లు వేసేందుకు కాంట్రాక్టర్లు ముం దుకు రాలేదంటే బిల్లుల పెండింగ్‌ ఎంత ప్రభావం చూపిందో తెలిసిపోతుంది. జిల్లాలో మేజర్‌ డిస్ర్టిక్ట్‌ రోడ్స్‌ (ఎండీఆర్‌), స్టేట్‌ హైవే్‌స(ఎ్‌సహెచ) నిధులకు సం బంధించి రోడ్ల అభివృద్ధి విషయంలో ఈ దుస్థితి నెలకొంది. జిల్లా లో అనంతపురం, కళ్యాణదుర్గం, ధర్మవరం డివిజన్ల పరిధి లో రూ.96కోట్లతో ఎండీఆర్‌ పనులు, రూ.52కోట్లతో మొ త్తం రూ.148కోట్లతో స్టేట్‌హైవేస్‌ పనులకు ఈ ఏడాది ఫిబ్రవరిలో తొలత టెండర్లు పిలిచారు. మొదటి నాలుగుసార్లు కాంట్రాక్టర్ల నుంచి స్పందన లేదు. ఆ తరువాత ధర్మవరం డివిజన పరిధిలో రూ.51కోట్ల పనులకు (ఎండీఆర్‌), రూ.28కోట్ల(స్టేట్‌హైవే్‌స)కు టెండర్లు పిలిచారు. మిగిలిన రూ.62కోట్లకు మూడుసార్లు ఆహ్వానించారు. మళ్లీ అదే పరిస్థితి. తాజాగా రెండురోజుల క్రితం ఏడోసారి 27 ఎండీఆర్‌, 10 స్టేట్‌హైవేస్‌ పనులకు టెండరు పిలిచారు. షరామామూలే.. వాటికి కూడా స్పందన లేదు.


ఎమ్మెలే ్య ఊరి రోడ్డు.. వెరీ బ్యాడ్‌..

ఈ రోడ్డును చూస్తుంటే ఒళ్లు జలదరిస్తుంది. ఈ రోడ్డుపై ప్రయాణమంటే ప్రాణాలను ఫణంగా పెట్టడమే. గమ్యం చేరేదాకా నమ్మకంలేదు. ఈ రోడ్డుపై వాహనాలు బోల్తాపడటం, అందులోని వారు గాయపడటం నిత్యకృత్యం. ఈ రోడ్డు ఎక్కడో మారుమూల ప్రాంతంలోనిది అనుకుంటే పొరబాటే. జిల్లా కేంద్రం నుంచి రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి స్వగ్రామమైన తోపుదుర్తి గ్రామానికి వెళ్లే (అనంతపురం-తగరకుంట) రోడ్డు. ఎమ్మెల్యే ఊరి రోడ్డే ఇలా ఉంటే.. మిగతా ఊళ్ల రోడ్ల పరిస్థితి ఎలా ఉంటుందో.. అర్థం చేసుకోవచ్చు.


Updated Date - 2021-11-15T06:05:50+05:30 IST