ప్రకటనలు సమాచార పౌరసంబంధాల శాఖ ద్వారానే ఇవ్వాలి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2020-12-02T06:00:21+05:30 IST

ప్రకటనలు సమాచార పౌరసంబంధాల శాఖ ద్వారానే ఇవ్వాలి : కలెక్టర్‌

ప్రకటనలు సమాచార పౌరసంబంధాల శాఖ ద్వారానే ఇవ్వాలి : కలెక్టర్‌

సంగారెడ్డిరూరల్‌, డిసెంబరు 1 : జిల్లాలోని అన్ని శాఖల అధికారులు వారి వారి కార్యాలయాల నుంచి జారీ చేసే ప్రకటనలు (అడ్వర్‌టైజ్‌మెంట్స్‌), నోటిఫికేషన్లు, టెండర్‌ నోటీసులు, భూ సేకరణ ప్రకటలన్నింటినీ కమిషనర్‌, సమాచార పౌర సంబంధాలశాఖ, హైదరాబాద్‌ వారి ద్వారానే జారీ చేయాలని అధికారులను కలెక్టర్‌ హనుమంతరావు ఆదేశించారు. ప్రభుత్వశాఖల నుంచి జారీ చేసే ప్రకటనలు తప్పనిసరిగా సమాచారశాఖ ద్వారా మాత్రమే జారీ చేయాలని, నిర్దిష్టమైన ప్రభుత్వ ఉత్తర్వులు (జీవో 52) ఉన్నాయన్నారు. ఇంతకు ముందే ఈ విషయమై ఆదేశాలు జారీ చేసినప్పటికీ జిల్లా పరిధిలోని కార్పొరేషన్లు, లోకల్‌బాడీల అధికారులు నేరుగా పత్రికలకు ప్రకటనలు జారీ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిం దని పేర్కొన్నారు. ఇక ముందు అన్ని ప్రభుత్వశాఖలు, జిల్లా పరిధిలోని రాష్ట్ర కార్పొరేషన్లు, స్థానిక సంస్థల అధికారులు తప్పనిసరిగా కమీషనర్‌, సమాచార పౌర సంబంధాల శాఖ, సమాచార భవన్‌, మాసబ్‌ట్యాంక్‌, హైదరాబాద్‌ కార్యాలయం ద్వారానే జారీ చేయాలని ఆదేశించారు. ప్రకటనలు జారీ చేసేందుకు సమాచార పౌర సంబంధాల శాఖ ఉప సంచాలకుల వారి ఫోన్‌ నెంబర్‌ 9949351678లో సంప్రదించాలని కలెక్టర్‌ సూచించారు. 


Updated Date - 2020-12-02T06:00:21+05:30 IST