కేఎల్‌ఐ కాల్వ భూనిర్వాసితులకు త్వరలో పరిహారం

ABN , First Publish Date - 2021-09-18T04:33:48+05:30 IST

కేఎల్‌ఐ కాల్వ భూనిర్వాసితులకు త్వరలో పరిహారం

కేఎల్‌ఐ కాల్వ భూనిర్వాసితులకు త్వరలో పరిహారం
ఎమ్మెల్సీకి వినతిపత్రం ఇస్తున్న రైతులు

  • ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి 


ఆమనగల్లు: కల్వకుర్తి ఎత్తిపోతల పథకం డి-82 కాల నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం త్వరలో పరిహారం అందిస్తుందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి  అన్నారు. ఆమనగల్లు మండలం సింగంపల్లి గ్రామానికి చెందిన భూ నిర్వాసిత రైతులు పరిహారం కోసం శుక్రవారం ఎమ్మెల్సీని కలిశారు. కాల్వ నిర్మించిన నాలుగేళ్లు గడుస్తున్నా నేటికీ పరిహారం అందించడం లేదని తెలిపారు. రైతుబంధు సాయం కూడా అందడం లేదని వాపోయారు. ఆమనగల్లు, కడ్తాల, తలకొండపల్లి, మాడ్గుల మండలాలకు చెందిన పలువురు లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.1.58 లక్షల చెక్కులను ఎమ్మెల్సీ నగరంలోని తన నివాసంలో పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు సురేందర్‌రెడ్డి, రవీందర్‌, రాములు, సత్తయ్య గౌడ్‌, యాదగిరి, భాస్కర్‌ రెడ్డి, శ్రీకాంత్‌ రెడ్డి, నరేశ్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఆమనగల్లు, కడ్తాల, మాడ్గుల, తలకొండపల్లి మండలాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎప్‌ ద్వారా మంజూరైన రూ.2.50 లక్షల చెక్కులను శుక్రవారం ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ నగరంలోని తన నివాసంలో పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు నిట్ట నారాయణ, శెట్టిపల్లి సర్పంచ్‌ గోదాదేవి సత్యం, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు నిట్ట నారాయణ, నాలాపురం శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు విజయ్‌, రాజు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-09-18T04:33:48+05:30 IST