వేరుశనగ రైతులకు నష్టపరిహారం అందించాలి

ABN , First Publish Date - 2021-10-27T05:36:15+05:30 IST

ఖరీఫ్‌లో వేరుశనగ సాగు చేసి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి రాటకొండ మధుబాబు డిమాండ్‌ చేశారు. మంగళవారం మదనపల్లె మండలం టేకులపాళెంలో మధుబాబు పర్యటించారు.

వేరుశనగ రైతులకు నష్టపరిహారం అందించాలి
టేకులపాళెంలో వేరుశనగ పంట సాగు చేసిన రైతులతో తెలుగు రైతు కమిటి రాష్ట్ర కార్యదర్శి మధుబాబు

తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి మధుబాబు


మదనపల్లె టౌన్‌, అక్టోబరు 26: ఖరీఫ్‌లో వేరుశనగ సాగు చేసి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి రాటకొండ మధుబాబు డిమాండ్‌ చేశారు. మంగళవారం మదనపల్లె మండలం టేకులపాళెంలో మధుబాబు పర్యటించారు. ఈ సందర్భంగా వేరుశనగ సాగు చేసిన రైతులతో ఆయన మాట్లాడారు. ఖరీఫ్‌లో వేరుశనగ సాగు చేసిన రైతులకు ఎకరాకు రూ.20వేలకు పైగా పెట్టుబడి ఖర్చు వచ్చిందన్నారు. కాని అదునులో వర్షం పడకపోవడంతో పంట దిగుబడి 30శాతం కూడా రాలేదన్నారు. దీని వలన జిల్లాలో 1.20లక్షల హెక్టార్లకు పైగా వేరుశనగ సాగు చేసిన రైతులందరికీ ఎకరాకు రూ.25వేల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. రైతు భరోసా, యాంత్రీకరణ పథకాలంటూ కంప్యూటర్‌లో బటన్‌ నొక్కే సీఎం జగన్‌... చిత్తూరు, అనంతపురం జిల్లాలో లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగు చేసి నష్టపోయిన రైతులను ఆదుకోవాలన్నారు. టీడీపీ నాయకులు వంటికొండ వెంకటేష్‌, శ్రీరామ వినోద్‌కుమార్‌, నాగయ్య, పూల మురళి, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-27T05:36:15+05:30 IST