యానాంలో కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి కృషి

ABN , First Publish Date - 2021-10-18T06:02:05+05:30 IST

యానాం నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నట్టు ఏఐసీసీ పరిశీలిలకురాలు జి.ఉషానాయుడు అన్నారు.

యానాంలో కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి కృషి

యానాం, అక్టోబరు 17:  యానాం నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నట్టు ఏఐసీసీ పరిశీలిలకురాలు జి.ఉషానాయుడు అన్నారు. రెండు రోజుల పర్యటన కోసం కాంగ్రెస్‌ బృందం యానాం వచ్చింది. యానాం యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఆర్ధాని దినేష్‌ నేతృత్వంలో నియోజకవర్గంలోని పలు గ్రామల్లో ఉషానాయుడు పర్యటించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. యానాంలో పార్టీ అభివృద్ధి, మున్సిపల్‌ ఎన్నికలు తదితర అంశాలపై చర్చించారు. యానాం మున్సిపల్‌ ఎ న్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందన్నారు.  యానాంలో కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు దినేష్‌ నేతృత్వంలో జరుగుతాయన్నారు.  కాంగ్రెస్‌ ప్రతినిధులు గంట సూర్యకిరణ్‌, ఎస్‌.అమురదర్షన్‌ తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2021-10-18T06:02:05+05:30 IST