ముగిసిన శ్రీవారి పవిత్రోత్సవాలు

Published: Thu, 11 Aug 2022 01:03:14 ISTfb-iconwhatsapp-icontwitter-icon
 ముగిసిన శ్రీవారి పవిత్రోత్సవాలువిశేషాలంకరణలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి

తిరుమల, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి) : తిరుమల శ్రీవారి ఆలయంలో మూడురోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు బుధవారం రాత్రి పూర్ణాహుతితో ముగిశాయి.ఉదయం 7 నుంచి 9 గంటల వరకు యాగశాలలో రుత్వికులు హోమాలు నిర్వహించారు. తర్వాత  శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం జరిగింది. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటలకు యాగశాలలో పూర్ణాహుతి నిర్వహించారు. తర్వాత శ్రీవారి ఉత్సవమూర్తులు విమాన ప్రదక్షిణంగా వెళ్లి ఆలయ ప్రవేశం చేయడంతో పవిత్రోత్సవాలు ముగిశాయి. జీయర్‌స్వాములు, టీటీడీ ఈవో ధర్మారెడ్డి, డిప్యూటీ ఈవో రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.