రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత: ఏడీజే

ABN , First Publish Date - 2021-11-27T05:42:59+05:30 IST

భారత రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యతని మదనపల్లె ఏడీజే నరేష్‌ పేర్కొ న్నారు. శుక్రవారం స్థానిక కోర్టులో రాజ్యాంగ దినోత్స వాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా న్యా యమూర్తి మాట్లాడుతూ... దేశానికి రాజ్యాంగం మూ లస్తంభమన్నారు.

రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత: ఏడీజే
రాజ్యాంగ దినోత్సవంలో పాల్గొన్న న్యాయమూర్తులు

మదనపల్లె క్రైం, నవంబరు 26: భారత రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యతని ఏడీజే నరేష్‌ పేర్కొ న్నారు. శుక్రవారం స్థానిక కోర్టులో రాజ్యాంగ దినోత్స వాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా న్యా యమూర్తి మాట్లాడుతూ... దేశానికి రాజ్యాంగం మూ లస్తంభమన్నారు. మానవహక్కుల పరిరక్షణలో రా జ్యాంగం కీలకపాత్ర పోషిస్తుందన్నారు. కులమ తాలకు అతీతంగా హక్కులు, చట్టాలున్నాయన్నారు. చట్టాలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని సూ చించారు. న్యాయమూర్తులు శ్రీనివాసమూర్తి, శ్రీని వాసరెడ్డి, ఆసీఫాసుల్తానా, ప్రవీణ్‌ కుమార్‌, కోర్టు సిబ్బంది, న్యాయవాదులు పాల్గొన్నారు. మదనపల్లె ఎంపీడీవో కార్యాలయం, మదనపల్లె ఆర్టీసీ బస్టాండు కూడలిలో ఎమ్మార్పీఎస్‌ ఆధ్వ ర్యంలో,  జ్ఞానాంబిక డిగ్రీ కళాశాల, బీటీ కళాశాల, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలల్లో, ఇందిరానగర్‌లో ఉన్న హ్యూమన్‌ రైట్స్‌ కార్యాలయంలో  హ్యూమన్‌ రైట్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇం డియా రాయలసీమ అధ్యక్షుడు రంగు రాజేంద్ర ఆధ్వర్యంలో, పీటీఎంలో బాస్‌ ఆ ధ్వర్యంలో, బి.కొత్తకోట జ్యోతి బ స్టాండులో ఎమ్మార్పీఎస్‌, బాస్‌ ఆధ్వర్యంలో వేర్వేరుగా, మదనపల్లె పట్టణంలోని అంబేద్కర్‌ సర్కిల్‌ వద్ద మాలమహానాడు   రాష్ట్ర అ ధ్యక్షుడు యమలా సుదర్శనం ఆధ్వర్యంలో, నిమ్మనపల్లె పట్టణం లోని  అంబేడ్కర్‌ విగ్రహం వద్ద మాలమహానాడు, ఎమ్మార్పీఎస్‌ల ఆధ్వర్యంలో, పెద్ద మండ్యం మండలంలోని వెలిగల్లు ప్ర భుత్వ ఉన్నత పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. 


కురబలకోట: రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఆశయ సాధనకు పాటుపడాలని అంగళ్లు సమీపంలోని మిట్స్‌ కళాశాల అసోసియేట్‌ డీన్‌ తులసీరామ్‌ నాయుడు పిలుపునిచ్చారు.  కళాశాలలో ఎన్‌సీసీ ఆధ్వర్యంలో 72వ రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం వ్యాసరచన పోటీలను ని ర్వహించి విద్యార్థులకు బహుమతులను అంద జేశారు.  లెఫ్టినెంట్‌ నవీన్‌కుమార్‌,  సంతోష్‌కుమా ర్‌, అధ్యాపక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-27T05:42:59+05:30 IST