గ్రామాల్లో బయటపడుతున్న కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-05-10T04:37:25+05:30 IST

మండలంలో ఆదివారం 50 కరోనా కేసులు బయటపడినట్లు తహసీల్దార్‌ ఎన్‌.రాజారావు తెలిపారు. నాలుగు సచివాలయాలు పరిధిలో నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఈ మేరకు నిర్ధారణ అయ్యాయన్నారు.

గ్రామాల్లో బయటపడుతున్న కరోనా కేసులు

నందిగాం మండలంలో 50..

నందిగాం, మే 9: మండలంలో ఆదివారం 50 కరోనా కేసులు బయటపడినట్లు తహసీల్దార్‌ ఎన్‌.రాజారావు తెలిపారు. నాలుగు సచివాలయాలు పరిధిలో నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఈ మేరకు నిర్ధారణ అయ్యాయన్నారు. కేసులు పెరుగుతున్నందున ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉం డాలని, అనవసరంగా బయటకు రావద్దని సూచించారు. గ్రామాల్లో కార్యదర్శుల ఆధ్వర్యంలో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు.


పాతపట్నంలో 48..

మెళియాపుట్టి (పాతపట్నం): మండలంలో పలు గ్రామాల్లో 48 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయని తహసీల్దార్‌ ఎం.కాళిప్రసాద్‌ తెలిపారు. ఆయా గ్రామాల్లో కంటైన్మెంట్‌ నిబంధనలు అమ లు చేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారానే కరోనాను నియంత్రించవచ్చన్నారు. కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు.  


జలుమూరులో 42...

జలుమూరు: మండలంలో వివిధ గ్రామాల్లో ఆదివారం 42 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు తహసీల్దారు జామి ఈశ్వరమ్మ తెలిపారు. పాజిటివ్‌ కేసులు ఎక్కువగా ఉన్న గ్రామాలను కంటైన్మెంట్‌ జోన్లుగా ప్రకటించి నిబందనలు అమలు చేస్తున్నామన్నారు. ఆయా గ్రామాలకు చెందిన వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి, వైద్య సిబ్బంది హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్న వ్యక్తులకు ఐసోలేషను కిట్లు అందించి వైద్యసేవలు అంది స్తున్నారని చెప్పారు. ఆక్సిజన్‌ పల్స్‌రేటు పడిపోయి సివియర్‌గా ఉన్న కేసులను ప్రభుత్వ ఆసుపత్రులకు రిఫర్‌ చేస్తున్న ట్లు పేర్కొన్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతంగా ఉన్నందున ప్రతి ఒక్కరు స్వీయ నియంత్రణ పాటించాలన్నారు. మాస్క్‌ ధరించడంతో పాటు శానిటైజర్‌ వినియోగించాలని సూచించారు. 


రేగిడిలో 32...

రేగిడి: మండలంలో ఆదివారం వివిధ గ్రామాలకు చెందిన 32 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిందని తహసీల్దార్‌ బి.సత్యం తెలిపారు. కరోనా సెకెండ్‌ వేవ్‌ ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉందన్నారు. ఇటీవల ప్రైమరీ, సెకెండరీ కాంటాక్టులకు నిర్వహిస్తున్న పరీక్షల్లో ఎక్కువ కేసులు బయటపడుతున్నాయన్నారు.  ప్రతిఒక్కరు కొవిడ్‌ నిబంధనలు పాటించాలని కోరారు.  


పరీక్షలు చేయించుకోండి..  

దీర్గాశి(పోలాకి): గ్రామాల్లో ప్రజలు జ్వరాలతో బాధపడుతున్నా కరోనా పరీక్షలు చేయించుకుని, ప్రాణాపాయం నుంచి బయటపడాలని  దీర్గాశి హె ల్త్‌వెల్‌ సెంటర్‌ ప్రతినిధులు  తూలుగు ఉష, శైలజ,  ఆశా కార్యకర్త  దాసరి విజయలక్ష్మి కోరారు.  ఆదివారం ఇంటింటికీ వెళ్లి జ్వరపీడితులకు అవగాహన కల్పించారు. జ్వరపీడితులంతా మందులు వాడాలని నిబంధనలు పాటించాలని సూచించారు. జాగ్రత్తగా ఉండడం ద్వారానే కరోనా నివారణ సాధ్యమన్నారు. 


 

Updated Date - 2021-05-10T04:37:25+05:30 IST