చిత్తూరు జిల్లాలో కొత్తగా 854 మందికి కరోనా..

ABN , First Publish Date - 2020-09-28T18:31:50+05:30 IST

జిల్లాలో శనివారం ఉదయం నుంచి ఆదివారం సాయంత్రం వరకూ కొత్తగా..

చిత్తూరు జిల్లాలో కొత్తగా 854 మందికి కరోనా..

కరోనా పాజిటివ్‌ 62,525కు చేరుకున్న వైరస్‌ కేసుల సంఖ్య


తిరుపతి(ఆంధ్రజ్యోతి): జిల్లాలో శనివారం ఉదయం నుంచి ఆదివారం సాయంత్రం వరకూ కొత్తగా 854 మందికి కరోనా వైరస్‌ సోకింది. ఇందులో శనివారం ఉదయం తొమ్మిది నుంచి ఆదివారం ఉదయం తొమ్మిది గంటల వరకూ 577 మంది పాజిటివ్‌ వ్యక్తుల్ని గుర్తించగా.. సాయంత్రంలోపు మరో 277 మంది గుర్తించినట్లు అధికార యంత్రాంగం తెలిపింది. వీరితో కలిపి ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా వైరస్‌ సోకిన వారి సంఖ్య 62,545కు చేరుకుంది. 


కొవిడ్‌ సెంటర్లలో 2,874 పడకల ఖాళీ..

తిరుపతిలోని ప్రభుత్వ కొవిడ్‌ ఆస్పత్రులు, కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో  ఆదివారం రాత్రి 10 గంటల వరకు 2,874 పడకలు ఖాళీగా ఉన్నాయి. వీటిలో 2,658 సాధారణ, 216 ఆక్సిజన్‌ బెడ్స్‌ ఉన్నాయి. సాధారణ పడకలకు సంబంధించి రుయాలో 101, స్విమ్స్‌ 134, ఈఎ్‌సఐలో  23,  విష్ణు నివాసంలో  273 (డార్మెంటరీ), 196 (గదుల్లో).. మాధవంలో 349. పద్మావతి నిలయంలో 86, గోవిందరాజసత్రంలో 848, శ్రీనివాసంలో 630, టీటీడీ ఉద్యోగులకు 18, ఖాళీగా ఉన్నాయి. ఇక ఆక్సిజన్‌ బెడ్స్‌ రుయాలో 108, ఈఎ్‌సఐ ఆస్పత్రిలో 32  అందుబాటులో ఉన్నాయి.  ఐసీయూలో  బెడ్స్‌ రుయాలో 35, ఈఎ్‌సఐ ఆస్పత్రిలో 41 అందుబాటులో ఉన్నాయి.  

Updated Date - 2020-09-28T18:31:50+05:30 IST