కరోనా మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే : ఉన్నం

ABN , First Publish Date - 2021-06-23T06:20:19+05:30 IST

కరోనా మరణాలు ముమ్మాటికి ప్రభుత్వ హత్యలేనని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉన్నం హనుమంతరాయచౌదరి ధ్వజమెత్తారు.

కరోనా మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే : ఉన్నం
నిరసనలో మాట్లాడుతున్న టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉన్నం

కళ్యాణదుర్గం, జూన 22: కరోనా మరణాలు ముమ్మాటికి ప్రభుత్వ హత్యలేనని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉన్నం హనుమంతరాయచౌదరి ధ్వజమెత్తారు. మంగళవారం స్థానికంగా హిందూపురం రోడ్డు నుంచి రెవె న్యూ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్క డే బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈసందర్భంగా ఉన్నం మాట్లాడుతూ సీఎం జగన నిర్లక్ష్యంతో కరోనా మ హమ్మారిని ఎదుర్కోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. విపత్కర పరిస్థితుల్లో సామాన్య ప్రజల జీవితాలు అతలాకుతలమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా నేపథ్యంలో రైతాంగం కుదేలైందని, రైతులు, రైతుకూలీలు, కార్మిక కుటుంబాలు వీధిన పడ్డాయన్నారు. కరోనా బాధిత కు టుంబాలకు రూ.10 లక్షలు ఆర్థికసాయం అందించాలని డిమాండ్‌ చేశారు. చంద్రన్న బీమా అమలులో ఉంటే కరోనా మృతుల కుటుంబాలకు అండ గా నిలిచేదని పేర్కొన్నారు. సీఎం జగన ప్రభుత్వంలో ప్రజలకు ఎలాంటి భరోసా లేకుండా పోయిందని దుయ్యబట్టారు. కొవిడ్‌ వ్యాక్సిన అందించడంలోనూ రాష్ట్రం దేశంలోనే వెనుకబడి ఉందన్నారు. అన్న క్యాంటీనలను తిరిగి ప్రారంభించి కొవిడ్‌ బాధితులతో పాటు పేదల ఆకలి తీర్చాలని కో రారు. విధి నిర్వహణలో మరణించిన వైద్య, పారిశుధ్య, పోలీస్‌, ఫ్రంట్‌లైన వారియర్స్‌ కుటుంబాలకు రూ.50లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చే శారు. అనంతరం  ఆర్డీఓ నిశాంతరెడ్డికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు ఆర్జీ శివశంకర్‌, లిడ్‌ క్యాప్‌ మాజీ డైరెక్టర్‌ ఆవుల తి ప్పేస్వామి, మాజీ వైఎస్‌ ఎంపీపీ గోళ్ల వెంకటేశులు, ఉన్నం మారుతిచౌద రి, కంబదూరు శ్రీరాములు, మల్లికార్జున, కొల్లాపురప్ప, గొర్ల గోవిందరాజు లు, నాగిరెడ్డిపల్లి వెంకటేశులు, దండు సత్యనారాయణ, తాహీర్‌, నాగేంద్ర, నరసింహప్ప, రామమూర్తి, సాయినాథ్‌, కొత్తపల్లి తిప్పేస్వామి, విరుపాక్షి,  డీకే రామాంజినేయులు, మల్లికార్జున, రాయపాటి రామాంజినేయులు, జీవీ ఆంజినేయులు, గోవిందరెడ్డి, కొల్లాపురప్ప, గోవిందప్ప, లక్ష్మణమూర్తి, కృష్ణమోహన, నారాయణస్వామి, ఊటంకి రామాంజినేయులు, చిత్రలింగ, శివప్రసాద్‌, వెంకటేశులు, హనుమప్ప, ఆదెప్ప ఓబులేషప్ప, రాజేష్‌, గడ్డం రా మాంజినేయులు, పాలబండ్ల రామన్న, కరిడిపల్లి రంగప్ప, గుద్దెళ్ల హరి, ఐ దుకల్లు భాస్కర్‌, నాగరాజు, రామస్వామి, బసంపల్లి హనుమంతరెడ్డి, రా మన్న, పాలవాయి సురేష్‌, ఓబన్న, మల్లాపురం హనుమంతరాయుడు, వ న్నూర్‌స్వామి, చంద్ర, పాతలింగ, దొడగట్ట కొండన్న, భీమలింగ, చంద్రమోహన, రాజేష్‌, బసవరాజు, గోళ్ల రాము, హనుమప్ప, బొజ్జన్న తిమ్మారెడ్డి, ములకనూరు కిష్ట, కిషోర్‌, తిప్పారెడ్డి, సత్యప్ప, పరమేష్‌, సత్యనారాయణ, బాలరాముడు, బషీర్‌, బాషా పాల్గొన్నారు.  

Updated Date - 2021-06-23T06:20:19+05:30 IST