ఇవీ నిబంధనలు.. సడలింపులు

ABN , First Publish Date - 2021-05-05T06:00:40+05:30 IST

రాజమహేంద్రవరం (ఆంధ్రజ్యోతి) మే 4: కొవిడ్‌ రెండవ దశ విజృంభణ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. ఇక నుంచి ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే మార్కెట్‌ లావాదేవీలు కొనసాగుతాయి. అంటే మొత్తం ఆరు గంటలు మాత్రమే ప్రజలకు అనుమతిం చారు. 12 తర్వాత ఏ ఒక్కరినీ రోడ్డుపైకి రానివ్వరు. పోలీసులు మాత్ర మే రోడ్డుపై ఉంటారు. ఉదయం మార్కెట్‌ వేళలో కూడా 14

ఇవీ నిబంధనలు.. సడలింపులు

నేటి నుంచి ఉదయం 6 నుంచి 12 వరకే మార్కెట్లు

తర్వాత నుంచి మరుసటి రోజు 6 గంటల వరకు పూర్తి కర్ప్యూ 

అత్యవసర సర్వీసులకు మాత్రం మినహాయింపు

రాజమహేంద్రవరం (ఆంధ్రజ్యోతి) మే 4: కొవిడ్‌ రెండవ దశ విజృంభణ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. ఇక నుంచి ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే మార్కెట్‌ లావాదేవీలు కొనసాగుతాయి. అంటే మొత్తం ఆరు గంటలు మాత్రమే ప్రజలకు అనుమతిం చారు. 12 తర్వాత ఏ ఒక్కరినీ రోడ్డుపైకి రానివ్వరు. పోలీసులు మాత్ర మే రోడ్డుపై ఉంటారు. ఉదయం మార్కెట్‌ వేళలో కూడా 144 సెక్షన్‌ అమల్లో ఉంటుంది. ఎక్కడా ఐదుగురికంటే ఎక్కువ గుమిగూడకూడదు. అత్యవసర సర్వీసులకు మాత్రం మినహా యింపు ఇచ్చారు. మెడికల్‌, ప్రింట్‌ అండ్‌ ఎలక్ర్టానిక్‌ మీడియా, టెలికమ్యూనికేషన్‌, ఇంటర్నెట్‌, బ్రాడ్‌కాస్టింగ్‌ సర్వీసులు, పెట్రో ల్‌ బంక్‌లు, ఎల్పీ గ్యాస్‌ అవుట్‌లెట్‌, ఎలక్ట్రిసిటీ, పవర్‌ జనరేషన్‌, ప్రైవేట్‌ సెక్యూరిటీ సర్వీసులకు అనుమతులు ఇచ్చారు. మాన్యు ఫ్యాక్చరింగ్‌ పరిశ్రమలు, వ్యవసాయ పనులకు కరోనా నిబంధనలు పాటిస్తూ అనుమతులిచ్చారు. ప్రభుత్వాధికారులు ఆఫీసులకు హాజరుకావొచ్చు. ఇక జిల్లాలో మద్యం దుకాణాలు ఉద యం 6 నుంచి 12 గంటల వరకే ఓపెన్‌ చేస్తారు. అక్కడ క్యూ పాటించాలి. మాస్కులు ధరించాలి.


మళ్లీ మొదలైన కష్టాలు

కరోనా కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. అన్ని సంస్థలకు కేవ లం ఆరు గంటలు మాత్రమే అనుమతి ఇవ్వడం వల్ల ప్రజలకు ఉపాధి దెబ్బతింటుంది. కార్మికులు, కూలీలు, భవన నిర్మాణ కార్మికులకు నష్టం జరుగనుంది. తమకు మధ్యాహ్నం రెండు గంటల వరకు అవకాశం ఇస్తే పని ముగించుకుని ఇంటికి వెళ్లడానికి అవకాశం ఉంటుందని భవన నిర్మాణ కార్మికులు కోరుతున్నారు. అలాగే రోజువారీ కూలీనాలీ చేసుకునేవారు, ఆటో వాలాలకు ఆర్థిక కష్టాలు తప్పవు. ఇప్పటికే కొన్ని వ్యాపారాలు చతికిలపడ్డాయి. గతేడాది అనుభవించిన కష్టాలు మళ్లీ పునరావృతమవుతాయని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

Updated Date - 2021-05-05T06:00:40+05:30 IST