కలెక్టరేట్‌కు కొవిడ్‌ ఎఫెక్ట్‌

ABN , First Publish Date - 2021-05-07T05:10:40+05:30 IST

కొవిడ్‌ ఎఫెక్ట్‌తో సంగారెడ్డి కలెక్టరేట్‌ బోసిపోతున్నది. అన్ని ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన కార్యాలయాలు కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌లోనే ఉన్నాయి. కలెక్టర్‌, అడిషనల్‌ కలెక్టర్లతో పాటు అన్ని విభాగాల ఉన్నతాధికారుల ఆఫీసులు ఇక్కడే ఉంటాయి.

కలెక్టరేట్‌కు కొవిడ్‌ ఎఫెక్ట్‌
ఉద్యోగులు లేక ఖాళీగా ఉన్న కలెక్టరేట్‌లోని విభాగాలు

విధులకు హాజరుకాని అధికారులు, ఉద్యోగులు 

ఖాళీగా దర్శనమిస్తున్న కుర్చీలు  


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, మే 6: కొవిడ్‌ ఎఫెక్ట్‌తో సంగారెడ్డి కలెక్టరేట్‌ బోసిపోతున్నది. అన్ని ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన కార్యాలయాలు కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌లోనే ఉన్నాయి. కలెక్టర్‌, అడిషనల్‌ కలెక్టర్లతో పాటు అన్ని విభాగాల ఉన్నతాధికారుల ఆఫీసులు ఇక్కడే ఉంటాయి. వందల సంఖ్యలో ఉద్యోగులు పనిచేస్తుంటారు. కానీ ప్రస్తుతం కొవిడ్‌ ఎఫెక్ట్‌తో పరిమిత సంఖ్యలోనే ఉద్యోగులు వస్తున్నారు. పలువురు అధికారులు, పదుల సంఖ్యలో ఉద్యోగులు కొవిడ్‌ బారినపడ్డారు. దీంతో కొన్ని విభాగాల్లో ప్రతీరోజు కొందరు ఉద్యోగులు మాత్రమే వచ్చేలా సర్దుబాటు చేసుకున్నారు. మరికొన్ని విభాగాల్లో తప్పనిసరిగా అందరూ హాజరుకావాల్సిందేనని ఆదేశించినా ఉద్యోగులు మాత్రం విధులకు రావడంలేదు. కలెక్టరేట్‌లోని పలు విభాగాలను గురువారం 11.30 నుంచి 12.15 గంటల వరకు ’ఆంధ్రజ్యోతి’ విజిట్‌ చేసింది. అన్ని విభాగాల్లోనూ చాలావరకు అధికారులు, ఉద్యోగులు విధులకు రాకపోవడంతో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. ప్రజలు కూడా ప్రస్తుత పరిస్థితుల్లో కలెక్టరేట్‌కు రావడంలేదు. కొవిడ్‌ సద్దుమణిగిన తర్వాత పనులను చేసుకోవచ్చని అనుకుంటున్నారు.

Updated Date - 2021-05-07T05:10:40+05:30 IST