కొవిడ్‌ వ్యాక్సిన్‌తో గర్భిణులు సురక్షితం

ABN , First Publish Date - 2021-07-27T05:45:37+05:30 IST

గర్భిణులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా కొవిడ్‌ వ్యాక్సిన్‌ సురక్షితంగా పనిచేస్తోందని రాజానగరం పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ బేబిరాధిక తెలిపారు.

కొవిడ్‌ వ్యాక్సిన్‌తో గర్భిణులు సురక్షితం

రాజానగరం, జూలై 26: గర్భిణులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా కొవిడ్‌ వ్యాక్సిన్‌ సురక్షితంగా పనిచేస్తోందని రాజానగరం పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ బేబిరాధిక తెలిపారు. జిల్లాలో మెగా వ్యాక్సినేషన్‌లో భాగంగా పలు మండలాల్లో సోమవారం కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ నిర్వహించారు. రాజానగరం పీహెచ్‌సీ పరిధిలోని సచివాలయాల్లో నిర్వహించిన కార్యక్రమంలో 1850 డోసులు లక్ష్యంగా కాగా దీనికి మించి 1900 మందికి కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ వేశామన్నారు. ఐసీఎమ్మార్‌ ధ్రువీకరించిన నేపథ్యంలో వైద్యాధికారుల పర్యవేక్షణలోనే వ్యాక్సినేషన్‌ నిర్వహిస్తామని, గర్భిణులందూ తప్పనిసరిగా వ్యాక్సిన్‌ వేయించుకోవాలని ఆమె కోరారు. 

Updated Date - 2021-07-27T05:45:37+05:30 IST