Narayanaya: గవర్నర్ తమిళి సై లక్ష్మణ రేఖ దాటారు..

ABN , First Publish Date - 2022-09-09T19:48:30+05:30 IST

బీజేపీ గవర్నర్లు ఆర్ఎస్ఎస్ అజెండా కంటే, ప్రధాని మోదీ అజెండా అమలు చేస్తున్నారని...

Narayanaya: గవర్నర్ తమిళి సై లక్ష్మణ రేఖ దాటారు..

తిరుపతి (Tirupathi): బీజేపీ గవర్నర్లు ఆర్ఎస్ఎస్ అజెండా కంటే,  ప్రధాని మోదీ అజెండా అమలు చేస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (Narayana) విమర్శించారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ గవర్నర్‌లు కేంద్ర దళారులు, బ్రోకర్లుగా ఉండకూడదని సూచించారు. తెలంగాణ గవర్నర్ తమిళి సై (Tamili sai) లక్ష్మణ రేఖ దాటారన్నారు. ప్రజా దర్బారు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. ప్రజలు ఇచ్చే సమస్యలు ఎవరు పరిష్కరించాలన్నారు.


బిగ్ బాస్‌ (Big Boss)ని విమర్శిస్తే మహిళలను విమర్శించినట్టు కాదని, చిరంజీవి (Chiranjeevi)కి, నాగార్జున (Nagarjuna)కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని నారాయణ అన్నారు. కో కో కొల యాడ్‌లో నటించవద్దంటే చిరంజీవి ఆపేశారని, తాను కూడా ఆ డ్రింక్‌లు తాగడం మానేశానన్నారు. బిగ్ బాస్ వద్దని నాగార్జునకు ఎన్నిసార్లు చెప్పినా.. డబ్బు కోసం కక్కుర్తి పడుతూ నాగార్జున కొనసాగిస్తున్నారని విమర్శించారు. అలిపిరి వద్ద టీటీడీ స్థలాన్ని ఒబరాయ్ స్టార్ హోటల్‌కు కేటాయిస్తూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, అది రద్దు చేసి టీటీడీనే భక్తులకు సౌకర్యాలు కల్పించే స్పీరుచ్యువల్ టౌన్ షిప్ చేయాలన్నారు. లేదంటే సీపీఐ పోరాటం చేస్తుందని నారాయణ స్పష్టం చేశారు.

Updated Date - 2022-09-09T19:48:30+05:30 IST