కరోనాపై నిర్లక్ష్యమేల?

ABN , First Publish Date - 2020-08-08T08:34:56+05:30 IST

కరోనా మహమ్మారి పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందో ప్రజలకు సమాధానం ..

కరోనాపై నిర్లక్ష్యమేల?

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలది బాధ్యతారాహిత్యం

‘పల్లెబాట’లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ


అనంతపురం క్లాక్‌టవర్‌, ఆగస్టు 7: కరోనా మహమ్మారి పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందో ప్రజలకు సమాధానం చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్‌ చేశారు. పల్లెబాట కార్యక్రమంలో భా గంగా బుక్కరాయసముద్రం మండలం వడియంపేటలో శు క్రవారం నిర్వహించిన కరోనా వైరస్‌ అవగాహన కార్యక్రమం లో ఆయన మాట్లాడారు. కరోనా మహమ్మారిని కట్టడి చేయటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నాయన్నా రు.  ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని రాజకీయ పార్టీల నేతలతో మాట్లాడారనీ, సీఎం జగన్‌ అఖిలపక్ష సమావేశం ఎందుకు ఏర్పాటు చేయట్లేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వివాదాస్పద అంశాలను పక్కన పెట్టి, కరోనా నివారణపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.


సీఎం వైఖరి ఏకపక్షంగా ఉందన్నారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ తీరు అధ్వానంగా ఉందన్నారు. కొవిడ్‌ నిధులు ఎక్కడికెళ్తున్నాయో సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చే శారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహా య కార్యదర్శులు జాఫర్‌, నారాయణస్వా మి, కార్యదర్శివర్గసభ్యుడు మల్లికార్జున, కా ర్యవర్గసభ్యుడు రమణ, శింగనమల నియోజకవర్గ కార్యదర్శి నారాయణస్వామి, మండ ల కార్యదర్శి ప్రసాద్‌, నాయకులు రాము, రా మకృష్ణ, హరికృష్ణ, రవీంద్ర, శ్రీనివాసులు, తిరుపతయ్య పాల్గొన్నారు.

Updated Date - 2020-08-08T08:34:56+05:30 IST