సాగు విస్తీర్ణం పెరిగింది

ABN , First Publish Date - 2021-10-09T05:02:56+05:30 IST

రాష్ట్రంలో సాగు గణనీయంగా పెరిగిందని రాష్ట్ర ఉద్యానవన శాఖ, పట్టు పరిశ్రమ శాఖ డైరెక్టర్‌ వెంకట్‌రాంరెడ్డి పేర్కొన్నారు. జహీరాబాద్‌లోని పీవీఆర్‌ ఫంక్షన్‌హాల్‌లో శుక్రవారం రైతులకు ఆలుగడ్డ సాగులో నూతన సాంకేతికత, యాజమాన్య పద్ధతులపై నిర్వహించిన అవగాహనా సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు.

సాగు విస్తీర్ణం పెరిగింది
ఉద్యానవనశాఖ, పట్టు పరిశ్రమశాఖ రాష్ట్ర డైరెక్టర్‌ వెంకట్‌రాంరెడ్డి

ఉద్యానవనశాఖ, పట్టు పరిశ్రమశాఖ రాష్ట్ర డైరెక్టర్‌ వెంకట్‌రాంరెడ్డి


జహీరాబాద్‌, అక్టోబరు 8: రాష్ట్రంలో సాగు గణనీయంగా పెరిగిందని రాష్ట్ర ఉద్యానవన శాఖ, పట్టు పరిశ్రమ శాఖ డైరెక్టర్‌ వెంకట్‌రాంరెడ్డి పేర్కొన్నారు. జహీరాబాద్‌లోని పీవీఆర్‌ ఫంక్షన్‌హాల్‌లో శుక్రవారం రైతులకు ఆలుగడ్డ సాగులో నూతన సాంకేతికత, యాజమాన్య పద్ధతులపై నిర్వహించిన అవగాహనా సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా రూ. 12 వేల కోట్లను వెచ్చించి ప్రతీ రైతుకు ఉచిత విద్యుత్‌ను అందజేస్తుందని తెలిపారు. దీంతో రాష్ట్రంలో పంటల సాగు గణనీయంగా పెరిగిందన్నారు. రాష్ట్రంలో ప్రతీ సంవత్సరం రెండు లక్షల మెట్రిక్‌ టన్నులమేర రైతులు ఆలుగడ్డ పంట సాగు చేస్తున్నారన్నారు. జహీరాబాద్‌ ప్రాంతంలో 3,500 ఎకరాల్లో ఆలుగడ్డ సాగుచేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఆయిల్‌పామ్‌ పంట సాగుచేసేవారికి ప్రభుత్వం 90 శాతం సబ్సిడీతో విత్తనం అందజేసి, నాలుగు సంవత్సరాల పాటు ఏటా రూ. 50 వేల చొప్పున అందజేస్తున్నదని తెలియజేశారు. 2022–23 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రంలో ఆయిల్‌పామ్‌ సాగు విస్తీర్ణం 20 లక్షల ఎకరాలకు పెంచేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని వెల్లడించారు. అనంతరం సెంట్రల్‌ పొటాటో రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ పాండ్య, ఊటీ, సిమ్లా ప్రాంతాలకు చెందిన పలువురు శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు దేవేందర్‌కుమార్‌, సంజయ్‌రావల్‌, వినయ్‌సాగర్‌, వెంకటాసలాం, జిల్లా వ్యవసాయ అధికారి నరసింహారావు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సునీత, ఆత్మ కమిటీ చైర్మన్‌ విజయ్‌కుమార్‌, ఏవోలు, ఏఈవోలు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-09T05:02:56+05:30 IST