
చిత్తూరు ..జిల్లా పంచాయతీ అధికారి దశరథ రామిరెడ్డి తిరుపతి జిల్లా ఉద్యానవన శాఖ అధికారిగా బదిలీ అయ్యారు. ఉద్యానవన శాఖ ఆయన మాతృ శాఖ. పలమనేరు హార్టికల్చర్ ఏడీగా ఉన్న ఆయన.. డిప్యుటేషన్‌పై రెండేళ్ల కిందట చిత్తూరు డీపీవోగా వచ్చారు. తన రెండేళ్ల డిప్యుటేషన్ పూర్తయ్యాక తిరిగి మాతృ శాఖకు వెళ్లారు. రాష్ట్రంలో పెద్దఎత్తున ఉద్యానవన శాఖ అధికారులను గురువారం బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో దశరథరామిరెడ్డిని తిరుపతి జిల్లా ఉద్యానవన శాఖ అధికారిగా పోస్టింగ్ ఇచ్చారు. ఆయన స్థానంలో ఇన్చార్జి డీపీవోగా టి.లక్ష్మిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.